కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయ‌డ‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంకల్పం 

వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి

భూములు కోల్పోతున్న రైతులతో  ప్ర‌త్యేక సమావేశం

అనంతపురం: కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కృషి చేస్తున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వ‌ర్‌రెడ్డి
పేర్కొన్నారు. రాకెట్ల-ఆమిద్యాల లిఫ్ట్ నిర్మాణం పూర్తి అయితే 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అనంత‌పురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల వద్ద హంద్రీనీవాపై 'ఆమిద్యాల-రాకెట్ల లిఫ్ట్' నిర్మాణం కోసం  భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు గ్రామసభ నిర్వహించారు. పరిహారం, తదితర అంశాలపై రైతులతో వారు ముఖాముఖి చర్చించారు. రాకెట్ల గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రవీంద్ర, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెరుగైన పరిహారం అందేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..  రాకెట్ల-ఆమిద్యాల లిఫ్ట్ నిర్మాణం పూర్తి అయితే 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ముందుకు రావాలని కోరారు. రూ .12 లక్షలు పరిహారం చెల్లించాలని అధికారులకు కోరామని చెప్పారు. గత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రాంత ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యం అయ్యాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో  మంజూరైన ఈ లిఫ్ట్ కు గతంలో  అనేక మంది అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు.  కార్యక్రమంలో  
పెన్నహోబిలం ఆలయ కమిటీ ఛైర్మన్ అశోక్ కుమార్, తహశీల్దార్ మునివేలు, రాకెట్ల, ఆమిద్యాల గ్రామాల సర్పంచ్ లు శివమ్మ, శ్రీరాములు, నాయకులు శ్రీనాత్ రెడ్డి, వీరన్న, తేజోనాథ్, మండల అగ్రి అడ్వైజరి చైర్మన్ వెంకటేసులు, రాకెట్ల నాయకులు నాగరాజు, శ్రీనివాసులు, సురేష్, బాబు ,రాకెట్ల, ఆమిద్యాల, సొల్లాపురం గ్రామాల రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top