ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై అభ్యంతరం

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

శ్రీరాంమూర్తి, ఐలాపురం రాజాలు టీడీపీ యాక్టివిస్టులు

అమరావతి: ఆర్టీఐ కమిషనర్ల నియామకంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి స్పందించారు. విజయవాడకు చెందిన హోటల్‌ యజమాని ఐలాపురం రాజాను ఇన్ఫరేష్మన్‌ కమిషనర్‌గా నియమించడంపై అభ్యంతరం తెలుపుతున్నామని విద్యాశాఖ మంత్రికి ప్రైవేట్‌ సెక్రటరీగా ఉన్న శ్రీరాంమూర్తి, ఐలాపురం రాజాలు టీడీపీ యాక్టివిస్టులని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ యాక్టివిస్టులను ఆర్టీఐ కమిషనర్లుగా నియమించడం తగదన్నారు. ఆర్టీఐ యాక్ట్‌ 2005, సెక్షన్‌ 15 ప్రకారం నియామకాలు చేపట్టాలని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. 2007లో ఆరుగురిని ఆర్టీఐ కమిషనర్లుగా నియమించడంతో ఆ నియామకాల్లో రాజకీయ ప్రమేయం ఉండటంతో సుప్రీంకోర్టు కొట్టేసిన విషయాన్ని లేఖలో వివరించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top