బాబుకు లోపల లోకేష్‌ పోరు..బయట కేసుల భయం

సామినేని ఉదయభాను

పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు.

ఈసీ నియమించిన సీఎస్‌ను చంద్రబాబు తప్పుపడుతున్నారు

చంద్రబాబు ఓటమి భయంతో ఉన్నారు. 

ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసేవారు మీ వెంటే ఉన్నారు

రిటైర్డు ఐఏఎస్‌ అధికారులు గవర్నర్‌ను కలిస్తే తప్పేంటి? 

దేవినేని ఉమా అవినీతిపై విచారణ జరిపిస్తాం..ప్రతి పైసా కక్కిస్తాం

 

అమరావతి: చంద్రబాబుకు లోపల లోకేష్‌ పోరు, బయట కేసుల భయం ఉందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత సామినేని ఉదయభాను పేర్కొన్నారు. చంద్రబాబు తన సామాజికవర్గం అధికారులనే నమ్ముతారని, అధికారులను, సీఎస్‌ను, ఈసీని కూడా నమ్మడం లేదన్నారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రక్షణనిధితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో 3.10 కోట్ల మంది ప్రజా తీర్పు ఇచ్చారు. వీరందరూ కూడా ఈవీఎం ద్వారానే ఓటు వేశారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ద్వారానే ఓటు వేశారు. ఇవాళ చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరుగెత్తున్నాయి. తనకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు వస్తుందని భావించి, ఎలక్షన్‌ కమిషన్‌పై, ప్రతిపక్షంపై ఈ నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ఒక దొంగలాగా వెనుకనుంచి ప్రవేశించి దొంగతనం చేయాలని వ్యవహరిస్తున్నారు. ఇంటి యజమాని మాదిరిగా ముందు గేటు నుంచి రాకుండా వెనుక నుంచి వస్తున్నారు. పోలవరంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. ఇవాళ ప్రాజెక్టులపై రివ్యూ చేస్తున్న చంద్రబాబు పెండింగ్‌ కమీషన్ల కోసం సమీక్షలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం కార్మికులు, అంగన్‌వాడీలకు వేతనాలు చెల్లించాల్సి ఉంది. అవేవి పట్టించుకోకుండా అధికారులను బెదిరించి, దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. సీఎస్‌ డీజీపీని కలవడం తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు.

ఇవాళ ఈవీఎంలు అన్నీ కూడా భద్రంగానే ఉన్నాయని, తీర్పు కొద్దిరోజుల్లోనే రాబోతోంది. ఇలాంటి సమయంలో అందరిని గందరగోళంలో నెట్టే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. వైయస్‌ జగన్‌పై చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని, గతంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అసెంబ్లీలో మైక్‌ ఇవ్వకుండా ప్రతిపక్ష నేతను అవమానించారు. ఈ ఎన్నికల్లో కోడెల శివప్రసాద్‌ ఒక అసెంబ్లీ అభ్యర్థిగా ప్రవర్తించకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాననే మాట చంద్రబాబు నోట రావడం లేదు. చంద్రబాబుకు ఒకపక్క లోకేష్‌ పోరు..బయట కేసుల బెడద..వీటన్నింటిని తట్టుకోలేక రాష్ట్రం వదిలి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఈవీఎంలపై , ఎన్నికల కమిషన్‌పై ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఎలక్షన్‌ కమిషన్‌దే అధికారం ఉంటుందన్నది అందరికి తెలుసు. అలాంటి ఎన్నికల కమిషన్‌పై చంద్రబాబు నిందలు వేస్తున్నారు. చంద్రబాబు ఎవరిని నమ్ముతారు. 2014లో డీజీపీగా రాములును నియమించారు. చందరబాబు మాట్లాడేది ఎవరు నమ్మడం లేదు. గవర్నర్‌ను ప్రతిపక్ష నాయకులు, రిటైర్డు ఐఏఎస్‌ అధికారులు కవలడంలో తప్పేంటి?.

చంద్రబాబు హయాంలో ప్రజల వ్యక్తిగత సమాచారం దొంగిలించబడింది. ఐటీ గ్రీడ్‌ ప్రతినిధిని ఇంతవరకు కోర్టులో ప్రవేశపెట్టలేదు. చంద్రబాబు చేసే నేరాలు, ఘోరాలు అన్ని కూడా అధికారం కోసమే. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఆయన కుతంత్రాలను ప్రజలు గమనించారు. ఆయన కుమారుడు కూడా మంగళగిరిలో ఓడిపోతారు. మంత్రి దేవినేని ఉమా ఈ ఎన్నికల్లో డబ్బును ఎదజల్లారు. వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత ఉమాకు లేదు. ఉమా..గుర్తించుకో..ఈ ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తాం. ప్రతి నయా పైసా కక్కిస్తాం. పోలవరంకు కేంద్రం ఇచ్చిన డబ్బులకు ఇంతవరకు లెక్క చెప్పలేదు. శంకుస్థాపనలకు వేల కోట్లు ఖర్చు చేసి దోచుకున్నారు. 

 

Back to Top