ప్రజలంతా ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు

34వ డివిజన్‌ వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి పుణ్యశీల

విజయవాడలో జోరుగా మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

విజయవాడ: ప్రజలంతా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారని వైయస్‌ఆర్‌సీపీ విజయవాడ 34వ డివిజన్‌ అభ్యర్థి పుణ్యశీల పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఇంటింటికి వెళ్లి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా పుణ్యశీల మాట్లాడారు. ఏ ఇంటికి ప్రచారానికి వెళ్లినా కూడా ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని, ఎదురొచ్చి మరీ మాకు జగనన్న అమ్మ ఒడి ఇచ్చారని, జగనన్న దీవెన వచ్చిందని, ఇళ్లు మంజూరు చేశారని, ఇలా ఏదో ఒక పథకం లబ్ధి పొందామని చెబుతున్నారు. ఇంటికి ఒకరైనా ప్రభుత్వపథకాల లబ్ధిదారులు ఉన్నారు. వైయస్‌ జగన్‌ అభిమానం ప్రతి గుమ్మంలో కనిపిస్తుంది. ఏ అవ్వను కదిలించినా, ఏ మహిళను కదిలించినా పింఛన్లు ఇంటికే వచ్చి ఇస్తున్నారని, పథకాలు అందుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే మాకు ఆయా పథకాలతో లబ్ధి పొందామని చెబుతున్నారు. వైయస్ఆర్‌సీపీకే మా ఓటు అంటూ, కచ్చితంగా మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని దీవిస్తున్నారు. ప్రజల స్పందన చూస్తుంటే ఇది ప్రచారంలా లేదు..విజయోత్సవ ర్యాలీలా ఉంది.

Back to Top