రాయలసీమకు చంద్రబాబు చేసింది శూన్యం

కరువు–చంద్రబాబు అన్నదమ్ములు

ఏం చూసి ప్రజలు టీడీపీకి ఓటేయ్యాలి

పుంగనూరు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అనంతపురం:ఏం చూసి ప్రజలు చంద్రబాబుకు ఓటేయ్యాలని పుంగనూరు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.ఏం చేశారని టీడీపీ ప్రభుత్వం ఓట్లు అడుగుతుందని అన్నారు. రాయలసీమకు చంద్రబాబు చేసింది శూన్యమన్నారు.అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు మళ్లీ మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కరువు–చంద్రబాబు నాయుడు అన్నదమ్ములని ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు కరువు విలయతాండవం చేస్తుందన్నారు.4 లక్షల 75వేల ఎకరాలను కాపాడనని చంద్రబాబు గొప్పలు చెబుతున్నాడని విమర్శించారు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు అన్నిరకాల కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు.

 

 

Back to Top