డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా: కొత్తపేట నియోజకవర్గం, కొత్తపేట మండలం వానపల్లి శివారు రామ్మోహన్‌పేటలో జరిగిన వివాహ వేడుక విందులో ఫుడ్ పాయిజన్‌కు గురైన బాధితులను వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పరామర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన 42 మందికి పైగా బాధితులు కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆసుపత్రికి వెళ్లిన చిర్ల జగ్గిరెడ్డి వారిని కలిసి ధైర్యం చెప్పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అవసరమైతే బాధితులను మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రులకు తరలించాలని వైద్య అధికారులకు ఆయన ఆదేశించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.