రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేసిన చంద్రబాబు

  విజయవాడ : ఎన్నికల నిర్వహిణపై, ఈసీపై చంద్రబాబు ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు గెలిచిన తరువాత ఎప్పుడూ ఈవీఎంల గురించి మాట్లాడలేదని.. చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్‌ గెలిచిన రాష్ట్రాల్లో కూడా ఈవీఎంలు అలాగే జరిగాయా అని నిలదీశారు. చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకి ఈవీఎంలపై అనుమానాలు ఉంటే హరిప్రసాద్‌బదులు వేరే వారిని పంపించవచ్చు కదా అని ప్రశ్నించారు. తన ఓటమికి ఈవీఎంలే కారణమని చెప్పే ప్రయత్నంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా.. వైఎస్‌ జగన్‌ను సీఎం కాకుండా ఆపలేరని హెచ్చరించారు.

 

 

Back to Top