కులాల మధ్య చిచ్చుపెట్టడంలో చంద్రబాబు ఘనుడు

బాబు చేసిన మోసానికి డాక్టర్‌ సుధాకర్‌కు పిచ్చిపట్టింది

వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు

కాకినాడ: కులాల మధ్య చిచ్చుపెట్టడంలో చంద్రబాబును మించిన ఘనుడు లేడని, దళిత కులాల మధ్య చంద్రబాబు పెట్టిన చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉందని వైయస్‌ఆర్‌ సీపీ నేత, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు అన్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాలకు కోసం దళిత ఉద్యోగులను బలి చేస్తోందని మండిపడ్డారు. రవీంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. డాక్టర్‌ సుధాకర్‌ 2019లో టీడీపీ తరుఫున ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నం చేశాడని, చంద్రబాబు మోసం చేయడంతో మతిభ్రమించి చివరకు పిచ్చివాడిలా మిగిలిపోయాడన్నారు. అందుకే రహదారులపై బట్టలు విప్పుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అటువంటి వ్యక్తి రోడ్లపై తిరుగుతూ తన ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవడమే కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. దయచేసి అతన్ని వెంటనే మానసిక ఆస్పత్రిలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా టీడీపీ నేతలు స్వార్థం కోసం దళితులను బలి చేయొద్దని కోరారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై దళితులకు పూర్తి నమ్మకం ఉందన్నారు. 

Back to Top