ఎనీటైం మళ్ల..

విశాఖ పశ్చిమ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌ వినూత్న ప్రచారం

విశాఖపట్నం:విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌  వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.నియోజకవర్గం ప్రజలకు ఏటిఎం తరహాలో ఎనీటైం  మళ్ల పేరుతో కార్డు పంపిణీ చేస్తున్నారు.ఈ కార్డుపై టోల్‌ఫ్రీ నెంబర్‌ ఉంటుందని,ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి ప్రజ సమస్యలు చెప్పుకుంటే 24 గంటలో పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు.వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చి తను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం నుంచే ఈ కార్డు సేవలు అందుబాటులో వస్తుందన్నారు.ప్రజల సమస్యలు పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Back to Top