తాడేపల్లి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ.6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. వైయస్ జగన్ మూడు నెలల్లో 4.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని వైయస్ జగన్ నెరవేర్చుతున్నారని చెప్పారు. ప్రతి నిరుద్యోగికి రూ.2 వేలు ఇస్తానని మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు కాలం గడిపి ఎన్నికల ముందు రెండు నెలలు రూ. వెయ్యి ఇచ్చి మోసం చేశారు. కానీ వైయస్ జగన్ ప్రారంభంలోనే ప్రజా సంక్షేమం మీద దృష్టిపెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా, వైయస్‌ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న వైయస్ జగన్. పాలన చరిత్రలో నిలిచిపోతుంది. పారదర్శకంగా ప్రజల సొమ్ము ప్రజలకే అందించాలని నిబద్ధతతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం, దాన్ని విమర్శిస్తున్న చంద్రబాబును చూస్తే ఊరంతా ధాన్యం ఎండబెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకుందంట. చంద్రబాబు పరిస్థితి అలాగే ఉందన్నారు.
చంద్రబాబుకు ఏం విమర్శించాలో అర్థం కాక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. పెన్షన్ పెంచడం, ఆశావర్కర్లకు వేతనాలు, యువతకు లక్షల ఉద్యోగాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఇవన్నీ వైయస్ జగన్ చేస్తుంటే జీర్ణించుకోలేక మాట్లాడుతున్నాడు. రుణమాఫీ హామీని కూడా సక్రమంగా అమలు చేయలేక నేను రైతు రుణమాఫీ చేశాను, మిగిలింది మీరు చేయండి అని దుర్మార్గపు కార్యక్రమాన్ని తీసుకురావడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. హుందా రాజకీయం అనేది లేకపోతే ప్రజలు చీత్కరించుకుంటాడని లేకుండా దిగజారిపోయి మాట్లాడుతున్నాడు. కేవలం ఒక పర్సంట్ తేడాతోనే సీఎం అయ్యావు. వచ్చిన తరువాత భారీ అవినీతికి పాల్పడ్డావు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు సీఎంను విమర్శించే అర్హత లేదన్నారు. అన్ని హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు వైయస్ జగన్ చేస్తున్న ఒక్క కార్యక్రమాన్ని కూడా అభినందించలేకపోతున్నాడని ఫైర్ అయ్యారు. గాంధీజీ చెప్పిన గ్రామస్వరాజ్యాన్ని వైయస్ జగన్ తీసుకొచ్చాడు. ఎవరూ ఇబ్బంది పడకూడదని చెప్పి గ్రామ వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చాడు. కోడెల శివప్రసాదరావు శవాన్ని భుజాన వేసుకొని దారుణాలు జరిగాయని మాట్లాడుతున్నాడు. శవరాజకీయం చేస్తూ వైయస్ జగన్‌పై నిందలు వేస్తున్నాడు.ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చేసేది ఒకటే శవరాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి నిరుద్యోగికి రూ.2 వేలు ఇస్తానని మాట ఇచ్చి ఐదు సంవత్సరాలు కాలం గడిపి ఎన్నికల ముందు రెండు నెలలు రూ. వెయ్యి ఇచ్చి మోసం చేశారు. కానీ వైయస్ జగన్ ప్రారంభంలోనే ప్రజా సంక్షేమం మీద దృష్టిపెట్టిన ఏకైక ముఖ్యమంత్రిగా, వైయస్‌ఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న వైయస్ జగన్. పాలన చరిత్రలో నిలిచిపోతుంది. పారదర్శకంగా ప్రజల సొమ్ము ప్రజలకే అందించాలని నిబద్ధతతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం, దాన్ని విమర్శిస్తున్న చంద్రబాబును చూస్తే ఊరంతా ధాన్యం ఎండబెట్టుకుంటే నక్క తోక ఎండబెట్టుకుందంట. చంద్రబాబు పరిస్థితి అలాగే ఉందని ఎద్దేవా చేశారు.