సామాజిక న్యాయం సమర్థవంతంగా అమలవుతోందనటానికి స్థానిక ఫలితాలే నిదర్శనం

ప్రభుత్వసలహాదారు (సోషల్‌ జస్టిస్‌)  జూపూడి ప్రభాకరరావు 

టీడీపీ ఎన్నికల్లో ఉన్నా, లేకపోయినా.. ఫలితం గుండు సున్నానే..
 
రాజకీయాధికారం ఏరోజూ అందని వర్గాలకు ఈరోజు పదవులు దక్కుతున్నాయి
 
 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎంకు ఇస్తున్న మధ్దతు చూసి ఓర్వలేకపోతున్నారు 

  అందుకే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు 

 ఆ దిశలోనే టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది 
 

 ప్రభుత్వసలహాదారు (సోషల్‌ జస్టిస్‌)  జూపూడి ప్రభాకరరావు 

  
రాజకీయాధికారం ఏరోజూ అందని వర్గాలకు ఈరోజు పదవులు దక్కుతున్నాయి
 
 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు సీఎంకు ఇస్తున్న మధ్దతు చూసి ఓర్వలేకపోతున్నారు 

  అందుకే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు 

 ఆ దిశలోనే టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోంది 

తాడేపల్లి: టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసినా..చేయ‌క‌పోయినా.. ఫలితం గుండు సున్నానే అని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు,  ప్రభుత్వసలహాదారు (సోషల్‌ జస్టిస్‌)  జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు.  సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ గత రెండున్నర సంవత్సరాలుగా సామాజిక విప్లవ పంథాను అనుసరిస్తున్నారు. అది ఎలాంటి విప్లవ పంధా అంటే ఇంతకాలం, సామాజిక, ఆర్ధిక అంశాలలో ఏనాడూ, ఏ పదవి దక్కనటువంటి, కొంతమందికి, కొన్ని కుటుంబాలకే పరిమితమైన రాజకీయ పదవులను ఈరోజు జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలో బడుగు, బలహీనవర్గాలకు వందలు, వేలుగా దక్కుతున్నాయి. శ్రీశ్రీగారు అన్నట్లుగా భూమార్గం పట్టించిన ఘనత శ్రీ వైయస్‌ జగన్‌కే దక్కింది. అందుకే సామాజిక న్యాయ సూత్రధారులు, శాస్త్రవేత్తలు అందరూ ఆంధ్రప్రదేశ్‌ లో భారత రాజ్యాంగ నిర్మాణానికి ప్రతిరూపంగా సామాజిక న్యాయం అమలవుతుందని చెబుతున్నారు. వైయస్ఆర్‌పీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం జూపూడి మీడియాతో మాట్లాడారు.

 పంచాయతీలు, మున్సిపాలిటిలు, నగర పాలక సంస్ధల ఫలితాల మాదిరిగానే ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయని ముందుగానే చెప్పాం. టీడీపీ వారేమో గెలవలేమని తెలుసుకుని ఎన్నికలను వదిలేసి పారిపోయారు. 

 పారిపోయే వాడి దగ్గర ఎవరుంటారు. యుద్ధానికి వెళ్లినపుడు రాజు లేకపోతే సైన్యం ఉంటుందా.. అనే రీతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్దితి ఉంది. చంద్రబాబు ప్రజల వద్ద నమ్మకాన్ని పోగొట్టుకున్నారు.

 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణాలలో వెనకబడిన వారంతా గత అసెంబ్లీ ఎన్నికలలో ముక్తకంఠంతో సీఎం శ్రీ వైయస్‌ జగన్ కు అండగా నిలబడ్డారు. ఆ నేపథ్యంలో ఆయన గ్రామ సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్ధను తీసుకువచ్చి మధ్య వర్తులకు అవకాశం లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా,  ప్రతి ఇంటి గడప వద్దకు సంక్షేమ పథకాలను తీసుకువెళ్తున్నారు.

  అవినీతి లేని స్వఛ్చమైన పాలన అందిస్తున్నారు. ఇది ఒక విప్లవం. దీని ద్వారా సామాజిక న్యాయం అమలవుతోంది. భారతదేశంలో 70 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ చెప్పిన రాజ్యాంగం ద్వారా రాజకీయాధికారం ఏరోజూ అందని వర్గాలకు, ప్రాంతాలకు సీఎంగారు అందించారు.

 ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అందుకున్న బడుగు, బలహీన వర్గాలన్నీ ఈరోజు శ్రీ వైయస్‌ జగన్‌ గారికి అండగా నిలుస్తున్నారు. ఎన్నికల నుంచి పారిపోయిన వ్యక్తికి ఎవరూ ఓటు వేయరు కదా. అసలు ఏ వర్గాలు మీతో ఉన్నారో తెలుగుదేశం పార్టీ చెప్పగలదా.

 టీడీపీని బీసీల పార్టీ అంటారు కదా. మరి వారు మీతో ఉన్నారా...? ఎస్సీలను బాబు ముక్కలుగా చేశారు. వారు మీతో ఎందుకు ఉంటారు..? ఎస్సీలపై టీడీపీ నేత చంద్రబాబు వాడిన భాషను ఎప్పటికీ ఈ వర్గాలు మరిచిపోరు. నిన్న గాక మొన్న మహిళా హోం మంత్రి సుచరిత గారిపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

 అలాంటి మాటలను నియంత్రించకుండా నవ్వుతూ కూర్చున్న చంద్రబాబు, టీడీపీ నేతలను ఏమనాలి..? మహిళలను, దళితులను, మైనారిటీలను అవమానిస్తారు. అలాంటప్పుడు మీకు ఎందుకు ఓటు వేస్తారు...?
- గ్రామ సచివాలయాలు, వలంటీర్లు వచ్చాక దళారీ వ్యవస్ధ పూర్తిగా నిర్మూలించబడింది. తెలుగుదేశంలో జన్మభూమి కమిటీల పేరుతో, దళారులుగా ఉన్న వాళ్లంతా ఈరోజు ఏడుస్తున్నారు. 

 ప్రజలలో ఇప్పుడు వస్తున్న రిఫ్లెక్షన్‌ భవిష్యత్‌ ఎన్నికలలో కూడా రాబోతుంది. ఈ విషయం తెలుసుకుని తెలుగుదేశం పార్టీ, దానికి వంత పాడే రాజకీయ పార్టీలు, పచ్చ మీడియాతో కలసి కుట్రలు పన్నుతున్నాయి. కుతంత్రాలు చేస్తున్నాయి. 

  వీటన్నింటికి బెదిరే వారు కాదు శ్రీ వైయస్‌ జగన్‌. ప్రభుత్వం అంటే  మీ కులపు వాడిని తీసుకుని వాడికి కాంట్రాక్ట్‌ అప్పచెప్పడం కాదు. ప్రభుత్వం అంటేనే పంచడం. ప్రస్తుత పాలనలో ప్రభుత్వం అంటేనే ప్రజలు. కొందరు నేడు అడుగుతున్నారు. సంక్షేమం తప్ప అభివృధ్ది ఎక్కడ అని. కనీవినీ ఎరుగని రీతిలో విద్య, వైద్య వ్యవస్థలను ప్రక్షాళన చేయడం, భవిష్యత్ తరాలకు వనరులు కల్పిచడం, నిన్నటికంటే ఈరోజు బాగుండటం, ఎప్పుడూ అవకాశం రాని వారిని రాజకీయ పదవులలో కూర్చోబెట్టడం, ఇవన్నీ అభివృధ్ది కాదా..?

  40 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు తెలియకపోతే తెలుసుకోవాలి. వెయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ప్రత్యక్షంగా రూ.1.40 లక్షల కోట్ల మేర ప్రత్యక్షంగా లబ్ది చేకూరింది. అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా వెనకబడిన వర్గాలను శక్తివంతం చేశారు. శ్రీ వైయస్‌ జగన్‌ వేల కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యల నుంచి వారిని బయట పడేయాలని సంకల్పం తీసుకున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వ పరంగా వారికి అండగా నిలబడ్డారు.

 నాడు–నేడు వంటి వాటి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి  చేస్తున్నారు. ఇంగ్లీషు మీడియంను పేదవారి చెంతకు చేరుద్దామంటే అడ్డుకుంది చంద్రబాబు. ఈరోజు టీడీపీ సీనియర్‌ నేత ప్రెస్‌ మీట్‌ పెట్టి అంటున్నారు.. ఈ ఎన్నికల్లో వారు లేరు కాబట్టి మేం గెల్చామని. నిజానికి మీరు ఎన్నికలలో ఉన్నా గుండుసున్నానే. 

 అమరావతిలో పేద ప్రజలకు ఇళ్లస్దలాలు ఇద్దామంటే.. మీరు సామాజికి సమతౌల్యత దెబ్బతింటుందని అడ్డుకోలేదా...? చంద్రబాబు చేసిన చెత్తపాలనను సరిదిద్ది, జగన్‌గారు సామాజిక విప్లవానికి, సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ ముందుకు వెళ్తున్నారు అదే సోషల్‌ జస్టిస్‌. శ్రీ వైయస్‌ జగన్‌గారి ఆలోచనా విధానాన్ని రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకుని, అందుకుని అండగా నిలుస్తున్నారు. మరోవైపు మహిళా సాధికారత దిశగా శ్రీ వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. దానిని మహిళలంతా హర్షిస్తున్నారు. అందుకే జగన్‌ గారికి మహిళలంతా అండగా మధ్దతు పలుకుతున్నారు.

 శ్రీ వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలను అందుకున్న ప్రజలు.. ఎన్నికలలో ఓట్ల రూపంలో కురిపించి విజయం చేకూర్చి పెట్టారు. ప్రజల కోసం పని చేస్తున్న నాయకుడికి, తమ కష్టాలను తీర్చిన వ్యక్తికి, కరోనా కాలంలోనూ కేంద్రం వదిలివేస్తే ప్రజలకు ఆసరాగా నిలబడి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన నాయకుడిగా శ్రీ వైయస్‌ జగన్‌కు ప్రజలు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 

  తమపై దాడులు చేసి, పోలీసులతో కుమ్మక్కై గెలిచారని అంటున్నారు. పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారు. ఏ ప్రభుత్వమైనా వారి విధి అది. మీరు పాలించినప్పుడు పోలీసులతో సెల్యూట్‌ కొట్టించుకోలేదా. ఎస్టీ వర్గానికి చెందిన గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమిస్తే.. మీరు విమర్శిస్తున్నారు. నిజానికి 22 ఏళ్లకే ఐపిఎస్‌కు ఎంపికైన సమర్ధుడైన వ్యక్తి గౌతం సవాంగ్‌. 

 ప్రభుత్వ ఆలోచన విధానాన్ని సాంఘికంగా అమలు చేస్తుంటే .. డీజీపీని తెలుగుదేశం పార్టీ అవమానించింది. దళిత మహిళ అయిన మహిళా హోం మంత్రిని అవమానించారు. ఇంత పెద్ద పదవులలో ఉన్న వారినే అవమానిస్తుంటే గ్రామాలలో ఉన్న అట్టడగు వర్గాలను మీరు బతకనిస్తారా...? అందుకే వారు మిమ్మల్ని వదిలేశారు. తెలుగుదేశం పార్టీది తుప్పుపట్టిన సైకిల్‌ అనుకున్నారు. దానిని తుక్కు కొట్టు వాడికి వేద్దామని ప్రజలు భావించారు. తెలుగుదేశం పార్టీలో ఆలోచించే వాడు ఎవరూ లేరు కాబట్టి విప్లవ పంథాలో ముందుకు వెళ్తున్న శ్రీ వైయస్‌ జగన్‌కు మధ్దతు పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.

 జగన్‌గారి ఆలోచనా విధానం ప్రజలు అందుకున్నారు కాబట్టి, ప్రతి ఎన్నికలో విజయం చేకూరుస్తున్నారు. వైయస్‌ఆర్‌ గారి తర్వాత మహిళా సాధికారిత పట్ల దృష్టి సారించిన వ్యక్తి శ్రీ వైయస్‌ జగన్‌. 

 రాష్ట్రం అప్పుల పాలవుతోందంటూ విమర్శలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం అప్పుల్లో లేదా. మరి ఆ సయమంలో సోషల్‌ జస్టిస్‌ ఎక్కడ ఉంది. దీనికి వారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో స్ధానిక సంస్ధలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, టీడీపీ నేతలు రెండు పెగ్గులు వేసుకుని ప్రెస్‌ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేటి వ్యతిరేక ఫలితాలను ఊహించి ప్రజలను డైవర్ట్‌ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోంది.. అని   జూపూడి ప్రెస్‌మీట్‌ ముగించారు.

Back to Top