కాకినాడ స్మార్ట్‌ సిటీ పనుల్లో అక్రమాలు

వైయ‌స్ఆర్‌ సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి 
 

కాకినాడ: స్మార్ట్ సిటి పనుల్లో కాకినాడ అర్బన్‌ ఎమ్మెల్యే కొండబాబు భారీగా ముడుపులు దండుకున్నారని వైయ‌స్ఆర్‌ సీపీ నాయకుడు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. వేసిన రోడ్ల మీదనే మళ్లీ రోడ్లు వేస్తున్నారని, పార్కుల్లో పాత గోడలకే రంగులేసి కొత్తగోడలు చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పనుల క్వాలీటి కంట్రోల్ పరిశీలించడం లేదని, ఎక్కడా నాణ్యత కానరావడం లేదని మండిపడ్డారు. వైయ‌స్ఆర్‌ సీపీ అధికారంలోకి రాగానే స్మార్ట్ సిటీ పనుల మీద సమీక్ష చేస్తామని, పనుల నాణ్యత మీద విచారణ జరుపుతామని ద్వారంపూడి స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని తేలితే ప్రజా ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారుల మీద  చర్యలు తప్పవని హెచ్చరించారు. కొన్ని పనులకు టెండర్లు లేకుండా నామినేషన్ల మీద పనులు అప్పగించారని విమర్శించారు. స్మార్ట్ సిటీ పనుల మీద విజిలెన్స్, మున్సిపల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 
 

తాజా ఫోటోలు

Back to Top