జయహో బీసీ అనే అర్హత చంద్రబాబుకు లేదు..

చంద్రబాబు మాటలు నమ్మి బీసీలు మోసపోతున్నారు.

ఐదేళ్లు ముందు చెప్పిందే.. నిన్న బీసీ సభలో చెప్పారు..

బీసీలను నమ్మించడానికి అసత్యాలు ప్రచారం

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌నేత ధర్మాన ప్రసాదరావు..

విజయవాడ:చంద్రబాబు లాంటి అసత్యవాది  ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత ధర్మానప్రసాదరావు అన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మాటలను పదేపదే నమ్ముతూ బీసీలు మోసపోతున్నారన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సుమారు ఐదు సంవత్సరాల  పరిపాలన పూర్తి చేసిన  ముఖ్యమంత్రి చంద్రబాబు జయహో బీసీ అనే మాట ముందు బీసీలకు ఏ ప్రయోజనాలు చేకూర్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో ేమీ చేయకుండా మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తాననడం సముచితంగా ఉంటుందా అని నిలదీశారు. బీసీలకు చంద్రబాబు చేసిందేమిలేదన్నారు. రేపు బీసీలు ప్రశ్నిస్తారనే భయంతోనే మళ్లీ  మోసం చేసే పనిలో పడ్డారన్నారు.

ఐదు సంవత్సరాలలో చిత్తశుద్ధిగా బీసీల కోసం పనిచేస్తే.. ఎన్నికల ముందు జయహో బీసీ అని సభ పెట్టనవసరం లేదన్నారు. బీసీలు చంద్రబాబు పనితీరును పరిశీలిస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పితే ఒక అర్థం ఉంటుందని, ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి. చంద్రబాబుకు అదిలేదు. ఐదు సంవత్సరాలు పూర్తిగా అధికారం వెలగబెట్టారు. సుమారుగా నాలుగు సంవత్సరాలు కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీతో ఉన్నారు. కేంద్రంలో ఉన్నప్పుడు ఎవరిని మంత్రులుగా చేశారు అని ప్రశ్నించారు. ఇద్దరు కేంద్రమంత్రులు ఏవర్గానికి చెందినవారని నిలదీశారు. సుమారుగా ఆరుగురినో, ఏడుగురినో రాజ్యసభకు పంపించారు. ఒక బీసీ అయినా దానిలో ఉన్నారా...అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు బీసీల పట్ల ఏవగింపు,చులకన భావన ఉందని మండిపడ్డారు. బీసీల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న  దైవ భక్తుడు, నిజాయతీ పరుడైన రిటైర్డ్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య చంద్రబాబు స్వభావం గురించి గతంలో తెలిపారని గుర్తు చేశారు. ఆయన అభిప్రాయాలను చెప్పలేదని, రికార్డులతో సహా వెల్లడించారన్నారు. బీసీలకు జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తారన్నారు. దానికి చంద్రబాబు సమాధానం చెప్పలేకపోయారన్నారు. న్యాయవ్యవస్థలో బీసీలు జడ్జీలుగా నియమించడానికి పనికిరారు అన్నట్లుగా.. కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు రాసిన లేఖలోని అంశాలను బయటపెట్టారన్నారు. బీసీలు మళ్లీ చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితి ఉందా..అది సాధ్యం కాదన్నారు.  మత్స్యకారులను ఎస్టీలో కలిపివేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, మత్స్యకారులు చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు  వేస్తే మోసం చేశారని తెలిపారు.

మత్స్యకారులు నాలుగు సంవత్సరాలు వేచి చూశారని, ప్రజాస్వామ్యమార్గంలో వారు  నిరసన దీక్ష చేశారని. చంద్రబాబుతో వారి సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నిస్తే తమాషా చేస్తున్నారా.. అంతుచూస్తానంటూ దూషించారని గుర్తు చేశారు. బీసీల పట్ల చంద్రబాబు అంతరంగం ఎలా ఉందో తెలుస్తోందన్నారు. నాయీ బ్రాహ్మణలు కూడా చంద్రబాబు  మాటలు నమ్మి  ఓట్లు వేశారని..వారికిచ్చిన హామీలను అమలు చేయకుండా  వారిని దూషించి అవమాన పరిచారన్నారు. యథేచ్ఛగా బీసీలను మోసగించవచ్చనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ఉన్నారన్నారు. లక్ష 25వేల కోట్ల రూపాయాలు అప్పు తెచ్చి, అదనంగా పన్నులు వేసి రెవెన్యూ వసూలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఏమీ చేసిందని ప్రశ్నించారు.

బీసీ జయహో సభలో చంద్రబాబు మాట్లాడుతూ చప్పట్లు కొట్టామని కోరిన ప్రజలు స్పందించలేదన్నారు. చంద్రబాబు అంతరంగాన్ని బీసీలు గ్రహించారన్నారు. మేనిఫెస్టోలో బీసీల కోసం అనేక హామీలు ఇచ్చారని అందులో ఎన్ని అమలు చేశారో ఎప్పుడైన సరి చూసుకున్నారా అని అన్నారు. ఒక అంశానైనా  చిత్తశుద్ధితో అమలు  చేశారా అని ప్రశ్నించారు. చేయకపోగా.. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డిని అవమానించే విధంగా మాట్లాడారన్నారు. వైయస్‌ఆర్‌  రిజర్వేషన్లు తగ్గించడానికి ప్రయత్నం చేశారనే అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేశారన్నారు. వైయస్‌ఆర్‌ బీసీలను ఎంత ప్రేమగా చూశారో ప్రజలకు తెలుసు.ఆయన హయాంలో ఉన్న మంత్రులు ఎంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునేవారో అందరికి తెలుసు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిర్ణయం బీసీలకు ఎంతో ఉపయోగపడిందన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా చంద్రబాబు చిత్తశుద్ధిగా అమలు చేయలేదన్నారు. పూర్తిగా నీరుగార్చరని మండిపడ్డారు.

చంద్రబాబు తన పాలనలో ప్రైవేట్‌ మేనేజ్‌మెంట్‌లకే ప్రయోజనం చేకూరని ధర్మాన మండిపడ్డారు.  కేవలం ధనవంతుల పిల్లలు మాత్రమే చదువుకోవాలనేవిధంగా ప్రైవేట్‌ కళాశాలలో ఫీజులు పెంచారన్నారు. ప్రతి సందర్భంలో చంద్రబాబు వైఖరీ తెలుస్తోందన్నారు.కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం చేశారన్నారు .మేనిఫెస్టోలో ఉన్న అంశాలకు రాజమండ్రి సభలో చెప్పిన అంశాలకు తేడాలు చూసుకోవాలన్నారు. ఐదేళ్లు ముందు చెప్పిందే నేడు చెబుతున్నారన్నారు. ఇలా చెప్పడానికి సిగ్గులేదా అని దుయ్యబట్టారు. కొత్త పార్టీ మాదిరిగా బెబుతున్నారని, నటనలు ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంఖ్య ఈ రాష్ట్రంలో 50 శాతం ఉందని..బీసీల్లో జీవనప్రమాణాస్థాయి పెంచడానికి, ఆత్మవిశ్వాసం నింపడానికి ఒక కార్యక్రమం అయినా చేశారా  అని ప్రశ్నించారు. పరిపాలనను రహస్య జీవోలతో చేసే చంద్రబాబుకు జయహో బీసీ అనే అర్హత లేదన్నారు. బీసీలకు అన్ని విధాల అన్యాయం చేసిన వ్యక్తిగా చంద్రబాబు మిగులుపోతారన్నారు. కేవలం ధనవంతులకు కొమ్ముకాసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. వైయస్‌ జగన్‌ తన తండ్రి వైయస్‌ఆర్‌ వారసత్వాన్ని పుచ్చుకుని మళ్లీ సమ సమాజం నిర్మాణం చేయడానికి ఒక అడుగు ముందుకు వేస్తున్నారని ప్రజలు ఆశ్వీరాదించాలని కోరారు.

Back to Top