స్వీయ రక్షణే కరోనా నియంత్రణకు మార్గం

వైయస్‌ఆర్‌ సీపీ నేత దేవినేని అవినాష్‌

విజయవాడ: స్వీయ రక్షణే కరోనా నివారణకు మార్గం అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దేవినేని అవినాష్‌ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలను ప్రజలంతా స్వాగతిస్తున్నారని వివరించారు. నిత్యావసర సరుకులు అందరికీ అందుబాటులో ఉంచడం, రేషన్‌ ఉచితంగా ఇవ్వడంతో పాటు ప్రతి కుటుంబానికి వెయ్యి ఆర్థికసాయం అందించనున్నట్లు వివరించారు.  గ్రామ/ వార్డు వలంటీర్ల వ్యవస్థ ఈ వ్యాధి నివారణలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి లాంటి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా వెంటనే 104 లేదా ప్రభుత్వ టోల్‌ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇస్తే వెంటనే వైద్య సదుపాయం అందుతుందన్నారు.  

Back to Top