మహా విష సర్పం చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు

విశాఖ: వేయి పడగలున్న మహా విష సర్పం చంద్రబాబు అని వైయస్ఆర్‌సీపీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి.  రాయలసీమ, ఉత్తరాంధ్రపై చంద్రబాబు విషయం కక్కుతున్నారు. సీఎం వైయస్‌ జగన్‌పై అక్కసుతో ఉత్తరాంధ్ర ప్రజలపై బాబు కక్ష సాధిస్తున్నారు. 23 సీట్లు ప్రజలు ఇచ్చి చంద్రబాబును ప్రతిపక్ష నేతను చేసి తప్పు చేశారు. అమరావతిని ప్రజలు కోరుకుంటున్నారని చంద్రబాబు అనుకుంటే  టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. కౌన్సిల్‌ రద్దును చంద్రబాబు ఎలా అడ్డుకుంటారు?. విశాఖపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. తుపానులు, వరదలు వస్తాయని ప్రజలను భయపెడుతున్నారు.
 

Back to Top