పవన్‌కల్యాణ్‌ ప్యాకేజీ పాలిటిక్స్‌..

చంద్రబాబు,పవన్‌లు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నారు.

టీడీపీ–జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం 

చంద్రబాబు జుట్టే  కేసీఆర్‌ చేతిలో ఉంది..

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య

కడప: వైయస్‌వివేకానందరెడ్డి హత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని వైయస్‌ఆర్‌సీపి సీనియర్‌ నేత సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన కడపలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.వివేకానందరెడ్డి హత్య కేసును వైయస్‌ఆర్‌సీపీపై నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.విశాఖ ఎయిర్‌ఫోర్ట్‌లో వైయస్‌ జగన్‌పై హత్యయత్నం జరిగినప్పుడు కూడా.. వైయస్‌ జగనే చేయించుకున్నారని టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేసిందన్నారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలపై చిన్న సంఘటన కూడా జరగలేదని..ఆంధ్ర ప్రజలపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ తమ చేతుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు స్పెషల్‌ అబ్జర్వ్‌లను నియమించాలని డిమాండ్‌ చేశారు. పవన్‌ ముసుగు తొలగిపోయిందని, జనసేన వ్యవహార శైలిపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

దేశ రాజకీయాల్లో ఇంత బాధ్యత రహితంగా ప్రవర్తించిన వ్యక్తి మరోకరు ఉండరన్నారు.హైదరాబాద్‌లో భూములు లాక్కున్నారని,ఆంధ్రోళ్లపై దాడులు జరుగుతున్నాయని,పారిశ్రామికవేత్తలను కేసీఆర్‌ బెదిరించారనే డైలాగులన్నీ చంద్రబాబువి కావా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు చెప్పినవే పవన్‌ మళ్లీ చెబుతున్నారన్నారు.చంద్రబాబు మాటలకు వంత పాడుతున్నావని మండిపడ్డారు.స్వచ్ఛమైన రాజకీయాలు అందిస్తానని ప్రజలకు ప్రామిస్‌ చేసిన వచ్చిన పవన్‌ రాజకీయాల తీరు ఇదేనా అని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ ప్యాకేజీ పాలిటిక్స్‌ చేస్తున్నారు.చంద్రబాబు మామకు వెన్నుపోటు పోడిచారని, పవన్‌కల్యాణ్‌ తన లక్షలాది అభిమానులకు వెన్నుపోటు పోడుతున్నారని ధ్వజమెత్తారు. నిన్న కాక మొన్న కేసీఆర్‌ను పోగిడారని,నేడు విమర్శిస్తున్నారని విమర్శించారు.ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతున్నారు.పొత్తుల వెనుక, సీట్లు సర్దుపాటు వెనుక చంద్రబాబు లేడా అని పవన్‌కల్యాణ్‌ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు.

పవన్‌కు రాజకీయ విధానం లేదన్నారు.చంద్రబాబుకు గొడుగుపట్టి ఆయనను సీఎం పీఠంపై కూర్చో పెట్టడమేనా పవన్‌ ధ్యేయం అని ప్రశ్నించారు.ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు.పవన్‌కల్యాణ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉండవచ్చు..కాని  ఏం చేసిన చెల్లుబాటు అవుతుందనుకుంటే పొరపాటు అని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి కంటే శక్తివంతులు ప్రజలన్ని, వారి ముందు ఎవరైనా చిన్నవాళ్లేనన్నారు.పవన్‌ తన పార్టీ విధానాలపై స్పష్టత ఇవ్వాలని, లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు.పవన్‌  అజెండా ఏమిటో చెప్పాలన్నారు.జగన్‌ జుట్టు కేసీఆర్‌ చేతిలో ఉందని చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు.చంద్రబాబు జుట్టే కేసీఆర్‌ చేతిల్లో ఉందని, అందుకే çహైదరాబాద్‌లో పది సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్న కూడా చంద్రబాబు పరిగెత్తుకుంటూ వచ్చాడన్నారు.చంద్రబాబు ఎప్పుడైతే నోటుకు ఓటు కేసులో ఇరుక్కున్నావో అప్పడే చంద్రబాబు జుట్టు కేసీఆర్‌ చేతిలో ఉందన్నారు.ఢిల్లీ పెద్దలు పంచాయితీ చేయకుంటే చంద్రబాబు ఎప్పుడో జైలుకు వెళ్లేవారన్నారు.రాష్ట్రంలో 150 ఎమ్మెల్యేలు,25 ఎంపీలు వస్తే ఏం చేయాల్లో చూపిస్తానని చంద్రబాబు మాట్లాడుతున్నారని, గత ఎన్నికల్లో ఏం చేసి చూపించావని ప్రశ్నించారు.చంద్రబాబుకు పవన్‌కల్యాణ్‌ పూర్తిగా పార్ట్‌నర్‌గా తయ్యారయాడు.పవన్‌ ముసుగు వీరుడు అవతారమెత్తి పూర్తిగా దిగజారిపోయాడని విమర్శించారు.

2014లో టీడీపీకి సపోర్టు చేసినందుకు చింతిస్తున్నానని చెప్పిన పవన్‌..నేడు మళ్లీ చంద్రబాబుకు అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.నిన్న గాజువాకలో పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ వేస్తే అక్కడ పచ్చజెండాలు కనిపించాయన్నారు.జనం నిలదీస్తే చెప్పుకోవడానికి పవన్‌ వద్ద సమాధానం ఉందా అని ప్రశ్నించారు.దేశంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబేనన్నారు.అత్యంత  ధనవంతుడైన పొలిటీషియన్‌ చంద్రబాబే అన్నారు.బాబుతో జేడీ లక్ష్మీనారాయణ అర్ధరాత్రి చర్చలు జరిపారన్నారు.మంగళగిరిలో లోకేష్‌పై పవన్‌ తన అభ్యర్థిని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.అధికార పార్టీని వదిలేసి ప్రతిపక్షంపై పవన్‌ విమర్శలు చేస్తున్నారన్నారు.నిజ జీవితంలో నటుడైనా పవన్‌ రాజకీయాల్లో కూడా వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.టీడీపీకి బీ టింగా పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నారన్నారు. వైయస్‌ జగన్‌పై దాడి జరిగితే పవన్‌ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు.పవన్‌ తీరు చూసి ఆయన అభిమానులే చీదరించుకుంటున్నారని తెలిపారు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top