తిరుపతి జిల్లా: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తీరును ఎండగట్టారు. కూటమి ప్రభుత్వ మోసాలపై వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసనలకు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ‘యువత పోరు’ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్‌రెడ్డి, చంద్రగిరి సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్ రెడ్డి, నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ నిరుద్యోగులను చంద్రబాబు సర్కార్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను, ప్రజలను అడ్డగోలుగా మోసగించారని ధ్వజమెత్తారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వైయస్ జగన్ యువతకు, ప్రజలకు ప్రాధాన్యతనిచ్చి ఇచ్చిన ప్రతి హామిని నేరవేర్చారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.