వైయస్‌ జగన్‌ సారథ్యంలో ఏపీకి మంచిరోజులు

 వర్షం కురవడం శూభ సూచకం

వైయస్‌ జగన్‌ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి

సినీనటుడు, వైయస్‌ఆర్‌సీపీ నేత ఆలీ

 

విజయవాడ:కొత్త ఇంటికి నవధాన్యాలు ఎంత అవసరమో కొత్త రాజధానికి,ఆంధ్ర రాష్ట్రానికి  నవరత్నాలులు అంతే అవసరమని సినీనటుడు, వైయస్‌ఆర్‌సీపీ నేత ఆలీ అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సంతకం నవరత్నాలపై పెడతారని తెలిపారు.151 అసెంబ్లీ స్థానాలు,22 ఎంపీ సీట్లు సాధించడమనేది మామూలు విషయం కాదని అద్భుతమని తెలిపారు.వైయస్‌ జగన్‌ ఏపీకి అద్భుతమైన రూపు తీసుకువస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నామన్నారు.ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ప్రమాణా స్వీకారం సందర్భంగా వర్షం కురవడం శుభ సూచకమన్నారు. వైయస్‌ఆర్‌ను వర్షాల సీఎం అనేవారని, అదే విధంగా వైయస్‌ జగన్‌ పాలనలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,ఎమ్మెల్యేలు,ఎంపీలకు అభినందనలు తెలిపారు.సాధారణంగా పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు ఉదయం 5,6 గంటలకు ఓటు వేసి వెళ్ళిపోయేవారని, వైయస్‌ఆర్,వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిలపై అభిమానంతో రాత్రి 12 గంటలకు కూడా వచ్చి ఓటు వేశారని తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top