రాజ్య‌స‌భ‌లో వైయ‌స్ఆర్‌సీపీ సరికొత్త రికార్డు..  

టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో తుడిచిపెట్టుకుపోయిన టీడీపీ 

న్యూ ఢిల్లీ: వైయ‌స్ఆర్‌సీపీ మరో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏపీలోని 11 రాజ్యసభ సీట్లకు గాను 11 సీట్లను వైయ‌స్ఆర్‌సీపీ గెలుచుకుని స‌రికొత్త రికార్డు సృష్టించింది. రాజ్యసభ సీట్లలో వైయ‌స్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ విజయం సాధించింది. ఈ క్రమంలో నేటి నుంచి అధికారికంగా ఏపీ నుంచి రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీకి సంపూర్ణ ప్రాతినిధ్యం ఉంటుంది. రేపు రాజ్యసభ సభ్యులుగా నూతన ఎంపీలు  వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైయ‌స్ఆర్‌సీపీ అవతరించింది. రాజ్యసభలో బీజేపీ (97), కాంగ్రెస్(29), టీఎంసీ (13) తర్వాత స్థానం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. 

ఇదిలా ఉండగా.. రాజ్యసభలో టీడీపీ అడ్రస్‌ గల్లంతైంది. నిన్న(మంగళవారం)తో టీడీపీ ఏకైన రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ పదవీ కాలం ముగిసింది. దీంతో, రాజ్యసభలో టీడీపీ జీరో అయ్యింది. కాగా, టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. 

Back to Top