తాడేపల్లి: బద్వేలు ఉప ఎన్నికలో వైయస్‌ఆర్ సీపీ విజయం.. పేదల విజయం, నీతి, నిజాయితీగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామని వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. మంచి చేస్తున్న ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై వ్యక్తిగతంగా బురదజల్లాలని ప్రతిపక్షాలు చేసే ప్రయత్నాలను ప్రజలే తిప్పికొడుతున్నారని, అందుకు బద్వేలు తీర్పు నిదర్శనమన్నారు. బద్వేలు ఉప ఎన్నికలో వైయస్‌ఆర్ సీపీ ఘన విజయంపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బద్వేలు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఒకపక్క, మార్పు కోసం వచ్చానని చెప్పుకునే జనసేన మరోపక్క.. నిలబడి బీజేపీని భుజానికి ఎత్తుకొని బద్వేలులో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసినా.. ఆ పార్టీకి డిపాజిట్లు రాకుండా ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. బద్వేలు విజయం.. సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, అవినీతి రహిత ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుందన్నారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలే తిప్పకొడుతున్నారని, దయచేసి కుటిల బుద్ధులు మానుకొని బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మెలగాలని సూచించారు. బద్వేలులో ప్రజలిచ్చే తీర్పును బాధ్యతగా భావిస్తున్నామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో సీఎం నాయకత్వంలో రాష్ట్రంలో మరిన్ని ప్రజా ఉపయోగకర కార్యక్రమాలు చేపడతామన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ పోటీ కాదని, పేదరికం మీదనే పోటీ అని, పేదరిక నిర్మూలనకు సీఎం వైయస్ జగన్ నిత్యం ప్రయత్నం చేస్తున్నారన్నారు.