బాపట్ల: ``గుండె మీద చేయివేసుకుని ధైర్యంగా చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో వైయస్ఆర్ సీపీ పూర్తి బలం ఉంది. 151 స్థానాలకు ఒక్క సీటు తగ్గకుండా ఇంకా ఎక్కువ వస్తాయనే బలమైన నమ్మకం మాకుంది. వైయస్ జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 87 శాతం కుటుంబాలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందాయి. ప్రజలంతా వైయస్ఆర్ సీపీకి మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు`` అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ఎన్ని అబద్దాలు చెప్పినా ప్రజలంతా సీఎం వైయస్ జగన్ వెంటే ఉన్నారనడంలో సందేహమే లేదన్నారు. బాపట్ల జిల్లాలో వైయస్ఆర్ సీపీకి సంబంధించిన ముఖ్యనాయకులతో ఎంపీ విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. రానున్న ఎన్నికలకు పార్టీ బలోపేతం దిశగా నేతలతో చర్చించారు. అనంతరం బాపట్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. బాపట్ల జిల్లా చాలా క్లిష్టమైన జిల్లా అని, గతంలో అద్దంకి, చీరాల, రేపల్లె, పర్చూరు నియోజకవర్గాలు చేజార్చుకున్నామని, ఈసారి వాటితో పాటు వేమూరు, బాపట్ల కలిపి ఆరు నియోజకవర్గాల్లో వైయస్ఆర్ సీపీ విజయబావుటా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గుణపాఠం తప్పదు చంద్రబాబు ప్రతి రాజకీయా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఆయన ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకున్నా వైయస్ఆర్ సీపీ ఒంటరిగా పోటీ చేసి గతంలో కంటే అధికంగా స్థానాలను మా పార్టీ చేజిక్కించుకుంటుంది. వారు ఊహిస్తున్నట్లుగా టీడీపీ, బీజేపీలు గ్రాండ్ అలయన్స్‌గా ఏర్పడ్డా అందరికీ గుణపాఠం నేర్పుతాం. చంద్రబాబు తనకు తాను సింహం అని చెప్పుకుంటున్నాడు కానీ...ఆయన గర్జించలేని సింహం. నిద్ర లేచినప్పటి నుంచీ తాను సత్యహరిశ్ఛంద్రుడను అని చెప్పుకుంటాడు కానీ.. అసత్య హరిశ్చంద్రుడని ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు దొంగల పార్టీ. తెలుగు డెకాయిట్ల పార్టీ. ఒక్క బీజేపీతోనే కాదు.. మిగతా రాజకీయ పార్టీలతో కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. దేశ వ్యతిరేక శక్తులతో కూడా చేతులు కలుపుతున్నారు. టీడీపీ నేతలు అధికార దాహంతో దేశ ద్రోహానికి కూడా పాల్పడటానికి వెనుకాడరు. వేర్పాటువాదంతో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీలతో స్నేహం కోసం అర్రులు చాస్తున్నారు. 2047 నాటికి చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడో..? పోలీసులపైనే దాడిచేయించిన ఈ టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీ కాక ఏమవుతుంది..? ఏపీలో ఈ రోజుకు కూడా చంద్రబాబుకు ఒక స్థిర నివాసం లేదు. ఆయన తెలంగాణలోనే ఉంటున్నాడు. ఇక చంద్రబాబు ప్రవాసాంద్రుడు కాక ఏమవుతాడు..అలాంటి పార్టీని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్. సామాజిక న్యాయం అంటూ ఊదరగొట్టే చంద్రబాబు ప్రతి విషయంలో కులం, మతం చూస్తాడు..వాటికి అతీతంగా ఆయన పనిచేసింది లేదు. మీడియా, సోషల్ మీడియాను మేనేజ్ చేసుకుంటూ తాను ఒక విజనరీ అని చిత్రీకరించుకుంటున్నాడు. విజన్ 2020 అన్నాడు...అది అయిపోయింది..ఇప్పుడు విజన్ 2047 అంటున్నాడు. 2047 నాటికి చంద్రబాబు ఏ పరిస్థితుల్లో ఉంటాడో మీరే ఊహించుకోండి. ప్రజల్ని నమ్మించి మోసం చేసేందుకు ఇలాంటి విజన్ డాక్యుమెంట్లు విడుదల చేస్తుంటాడు. 2024లో చంద్రబాబు కథ ముగుస్తుంది..ఆయన కల చెదిరిపోయి..కన్నీటితోనే శేషజీవితం గడపాల్సిన పరిస్థితి వస్తుంది. టీడీపీ అనేది ఒక రాజకీయ పార్టీనే కాదు. అది తెలుగు డెకాయిట్‌పార్టీ. వ్యవస్థలపై దాడి చేసే ఆ పార్టీని ప్రజలు ఎన్నటికీ ఆదరించరు. అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు పలికే ఈ పార్టీ రాజకీయ పార్టీనే కాదు. టీడీపీ గుర్తింపును ఎన్నికల కమిషన్ రద్దు చేయాలి. 2024 తర్వాత ఇక టీడీపీ.. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఈ మధ్య పూనకం వచ్చినట్లు ఊగిపోతూ ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఒక్కసారి టైమ్స్ నౌ, ఇండియా టుడేల సర్వేలను చూస్తే వైయస్ఆర్ సీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత చంద్రబాబు రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిందే. 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అంతర్ధానం అవుతుంది. కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తాయి. ఇక లోకేశ్‌కి కూడా భవిష్యత్తు లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక సీట్లతో వైయస్ఆర్ సీపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. ప్రజల సమస్యలన్నిటినీ పరిష్కరించాం. జగనన్న సురక్ష ద్వారా మిగిలిపోయినవి కూడా పరిష్కరిస్తున్నాం. మూడో విడుత క్షేత్ర స్థాయిలో బూత్ లెవల్లో పార్టీ సమన్వయంపై కూడా కీలకంగా దృష్టి పెడతాం.