ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం

ఏపీఎన్జీవోస్‌ అపార్టుమెంట్స్‌ను ప్రారంభించిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: ఏపీఎన్జీవోస్‌ అపార్ట్‌మెంట్స్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఏపీఎన్జీవో అపార్టుమెంట్స్‌ నిర్మించుకోవడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం తరఫున ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. కోవిడ్‌ సమయంలోనూ ఉద్యోగులు సేవలు అందించారని, సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచనలు సాధ్యం కావాలంటే ఉద్యోగుల సహకారం ఉండాలన్నారు. ఉద్యోగుల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top