తాడేపల్లి: వివేకా కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని, ఈ కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం వైయస్ జగన్‌ను ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని విమర్శించారు. జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి ఎల్లో మీడియా ప్రయత్నించిందని.. దర్యాప్తునకు సంబంధించిన అంశాలు వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..:
కోర్టు తీర్పుతో తేటతెల్లం:
– రాష్ట్రంలో పూర్తిగా గతి తప్పిన ఎల్లో మీడియా బరితెగించి వ్యవహరిస్తోంది. చివరకు కోర్టులు, జడ్జీలపైనా రోత రాతలు రాస్తోంది. కారుకూతలు కూస్తోంది.
– ఈరోజు కోర్టు తీర్పుతో ఆ విషయ తేటతెల్లమైంది. బరి తెగించిన ఎల్లో మీడియా వ్యవహారాన్ని న్యాయమూర్తి తీర్పు కాపీలోనే ప్రస్తావించారు.
– మా పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ తెలంగాణా హైకోర్టు ఈరోజు వచ్చిన జడ్జిమెంట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తోంది.
ఎల్లో మీడియా బరితెగింపు:
– వివేకా హత్య, కేసు దర్యాప్తు, ఆ తర్వాత వరసగా జరుగుతున్న సంఘటనలను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వక్రీకరిస్తోంది.
– ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ5, ఈనాడు, ఈటీవీ, మహాన్యూస్..తవిచారణను ప్రభావితం చేసేలా వారే ఓపెన్ ట్రయల్స్ చేస్తున్నారు.
– ప్రజాక్షేత్రంలో జగన్‌గారిని ఎదుర్కొనే సత్తా లేని టీడీపీకి అండగా ఒక అస్త్రం ఇవ్వడం కోసం ఆ మీడియా ఒక ఎజెండాతో పని చేస్తోంది.
– వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టినప్పటి నుంచి ఎల్లో మీడియా అసంబద్ధ పోకడ మరింత ఎక్కువైంది.
– ఏబీఎన్, మహాన్యూస్ చానళ్లు జడ్జిగారికి కూడా దురుద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేశారని.. ఈరోజు జడ్జిగారు తన తీర్పులో చెప్పారు.
– అలా కామెంట్స్ చేసిన వ్యక్తి కూడా ఒక సస్పెండెడ్ జడ్జి. ఆయన టీడీపీలో ఎలా తిరుగుతుంటాడో అందరికీ తెలుసు.
– ఒక దశలో జడ్జిగారు ఈ కేసు నుంచి తప్పుకోవాలనుకునే స్థాయికి పచ్చ మీడియా చర్యలు వెళ్లాయి.
వ్యవస్థలనూ ప్రభావితం చేసేలా..:
– వ్యవస్థలను మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, అవసరమైతే బెదిరించడం (థ్రెటెన్), ఇంకా అప్రతిష్ట పాల్జేయడం (డీఫేమ్) ఆ గ్యాంగ్‌కు అలవాటు.
– వాళ్ల పనులు, వ్యవహారాలు ఎలా ఉంటాయనేది ఈరోజు కోర్టు తీర్పుతో తేటతెల్లమైంది.
– దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను.
ఎల్లో మీడియాకు ముందే సమాచారం!:
– అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే సీబీఐ టీమ్ కర్నూలు వెళ్లింది.
– సోమవారం తెల్లవారు జామున సీబీఐ టీమ్ కర్నూలు వెళ్తే.. ఆదివారం రాత్రి ఏడున్నరకే కర్నూలు వెళ్లనున్న సీబీఐ అంటూ ఏబీఎన్‌లో బ్రేకింగ్స్ వచ్చాయి. ఇతర మీడియాకి దేనికీ ఈ విషయం తెలియదు.
– కేవలం వారికి మాత్రమే తెలియడం. ఆ మర్నాడు ఉదయం సీబీఐ కర్నూలు చేరడం.. దేన్ని సూచిస్తుంది?
– సీబీఐ అఫిడవిట్‌లో సీఎంగారి పేరు పెడుతోందని నెల ముందే ఎల్లో మీడియాలో వచ్చింది. ఇలాంటివి కోకోల్లలు.
– వాస్తవానికి ఇవన్నీ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం అంటారు.
అందుకే గౌరవంతో ఉన్నాం:
– వివేకా హత్య కేసుకు సంబం«ధించి మేము ముందు నుంచి ఒకే మాట చెబుతున్నాం. వైయస్సార్‌గారికి వివేకా.. రాముడికి లక్ష్మణుడు వంటివాడు.
– ఆ తర్వాత వైయస్సార్‌సీపీలో సీనియర్ నాయకుడిగా వ్యవహరించారు. జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా నిలబడ్డారు. కీలక ప్రాత పోషించారు.
– అయితే ఆయన హత్య కేసులో ఆరోపణలు మావైపు తిప్పడం అత్యంత దారుణమైన విషయం.
– ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన పని తాను చేసుకుపోతుంటే ఒప్పుకోవచ్చు.
– అలాగే ఛార్జ్‌షీట్లలో ఆరోపణలు ఎదుర్కొన్న వారు డిఫెండ్ చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు.
– తమపై వచ్చిన ఆరోపణలు ఎలా ఉన్నా.. కోర్టులో వాదించుకునే వీలు ప్రతి ఒక్కరికి ఉంటుంది.
– కానీ దురదృష్టవశాత్తూ సీబీఐ దర్యాప్తు పూర్తి ఏకపక్షంగా, ఒకే కోణంలో జరుగుతోంది.
– అంతే కాకుండా ఆ దర్యాప్తునకు సంబంధించిన పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు ఎల్లో మీడియాలో వస్తోంది.
– ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏకంగా ఆ మీడియానే ఆ దర్యాప్తు విధానాన్ని నిర్దేశిస్తోందా? అన్న అనుమానం కూడా కలుగుతోంది.
– సీబీఐ అనేది ఒక వ్యవస్థ. దాన్ని గౌరవిస్తున్నాం కాబట్టే.. పూర్తి సంయమనంతో ఉన్నాం.
– ఇంత జరుగుతున్నా.. మేం ఎక్కడా విమర్శించడం లేదు. ఎక్కడా ఆ వ్యవస్థను తప్పు పట్టకుండా గౌరవిస్తున్నాం.
అదే ధీమా పెంచిందేమో?:
– వ్యవస్థను గౌరవిస్తూ మేం మౌనంగా ఉన్నాం. అలాగే వివేకా బలహీనతలు బయట చర్చించడం మాకు ఇబ్బంది.
– దీంతో మేం మాట్లాడకపోవడం ప్రత్యర్థుల ధీమా పెంచినట్లుంది. అందుకే ఎల్లో మీడియా బరి తెగించి వ్యవహరిస్తోంది.
– తమ రోత రాతలు, కారుకూతలతో మాపై రౌడీయిజం చేస్తోంది. అయితే మేము వ్యవస్థలను గౌరవిస్తున్నాం కాబట్టే దాడులు భరిస్తున్నాం.
– టెర్రరిస్టుల్లా వారు మాపై అటాక్ చేయడం వల్ల పర్యవసానం ఎలా ఉంటుంది? దానివల్ల ఎంత అనర్ధం జరుగుతుందనేది ఈ కేసులో కనిపిస్తోంది.
జడ్జిగారికీ దురుద్దేశాలు ఆపాదించారు:
– జగన్‌గారిపైనే కాదు. ఒక వ్యాలీడ్ పాయింట్ రెయిజ్ చేసినా మేం సహించం అనేంత స్థాయికి ఆ ముఠా వెళ్తోంది.
– జడ్జిగారు విచారణలో లాజికల్‌గా ప్రశ్నలు అడిగారన్నందుకే ఆయనకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు.
– డబ్బులు మూటలు వెళ్లాయని అనగలిగారంటే వ్యవస్థలు తమ చేతుల్లో ఉన్నాయని వారెంత ధీమాతో ఉన్నారో అర్ధం అవుతోంది.
– వ్యవస్థలను గౌరవిస్తునందుకు మా చేతులు కాళ్లూ కట్టేసుకుని వారు కొడుతున్న దెబ్బలను భరించాల్సి వస్తోంది.
– టీడీపీకి, రామోజీ, రాధాకృష్ణకు అనుకూలంగా తీర్పులు ఉంటే.. రాజ్యాంగం నాలుగు పాదాల నడుస్తున్నట్లు చెబుతారు.
– అలా కాకుండా తీర్పులు వ్యతిరేకంగా వస్తే.. కోర్టులనూ సహించబోమన్నది వారి ఇంటర్వ్యూల్లో స్పష్టమైంది.
వేధింపులు. దుష్ప్రచారం. అవే లక్ష్యం:
– అరెస్టులతో వేధించడం, జగన్‌గారిపై దుష్ప్రచారం చేయడం.. ఇవే ఆ ముఠా లక్ష్యాలు.
– అందుకే వివేకా హత్య కేసును కేవలం ఒకే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
– ప్రతిసారి మేము చెబుతూనే ఉన్నాం. వివేకా హత్యలో మరో కోణం ఉంది. అందుకే కేసులో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని లొంగ దీసుకున్న, ఆ మీడియా ముఠా.. తాము అనుకున్నదే రాస్తోంది. ప్రచారం చేస్తోంది.
– కేసులో డాక్యుమెంట్ల ప్రస్తావన ఉంది. అయినా ఆవైపు ఎందుకు చూడరని అడుగుతున్నా పట్టించుకోలేదు.
– మావైపు నుంచి వరసగా ఒక్కొక్కరినీ తీసుకెళ్లారు. అలా చివరకు వైయస్ భాస్కర్‌రెడ్డిని కూడా అరెస్టు చేశారు.
– సీబీఐ అరెస్టులన్నీ మమ్మల్ని వేధించడానికి, జగన్‌గారిపై దుష్ప్రచారం చేయడం కోసమే జరుగుతున్నాయి.
– ఈ కేసులో రాజకీయ కోణం ఉందని సీబీఐ ఇటీవలే చెబుతోంది.
నాడు వివేకాను ఓడించారు. ఇప్పుడు..:
– ఆనాడు వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్రలతో ఓడించింది టీడీపీనే.
– నిజానికి 2017లో ఎమ్మెల్సీ స్థానాన్ని వివేకా కోరలేదు. కానీ వైయస్సార్‌సీపీ నాయకుల కోరిక మేరకు, జగన్‌గారు ఆయన్ను పోటీలో నిలిపారు.
– నిజానికి మా పార్టీకి అప్పుడు మెజారిటీ ఉంది. అందుకే టీడీపీ అభ్యర్థిని నిలబెట్టొద్దు. అయినా, ఆ పని చేసి, కుట్రతో గేమ్ ప్లాన్ చేసి, మా ఓటర్లను లోబర్చుకుని వివేకాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు.
– ఆనాడు తన తండ్రిని ఓడించిన వారితో కలిసి ఇప్పుడు వివేకా కూతురు సునీత పని చేస్తోంది.
– వివేకా హత్య తర్వాత.. ఇదే ఆంధ్రజ్యోతిలో.. ఆయన రెండో పెళ్లి కారణం ఎందుకు కాకూడదు అని వార్తలు రాశారు.
– అసలు కుటుంబ సభ్యులే ఏదో చేసినట్లున్నారని ఆ పత్రికే ఆరోజు సందేహం వ్యక్తం చేసింది.
– కానీ, ఇప్పుడు తమ స్వప్రయోజనాల కోసం, చంద్రబాబుకు మేలు చేయడం కోసం ఆ మీడియా యూటర్న్ తీసుకుంది.
– ఆనాడు తమ టార్గెట్ అయిన సునీత.. ఇవాళ వారికి సాధనంగా మారింది.
– నిజానికి తొలి నుంచి సునీత భర్త రాజశేఖర్‌రెడ్డికి, బిటెక్ రవికి సంబంధాలున్నాయి.
– అందుకే మాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది. వివేకా హత్యలో ఎంతో కొంత బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందేమోనని.
టికెట్ కేటాయింపు ఇష్యూ కాదు:
– జగన్‌గారు పార్టీ పెట్టగానే ఎంపీ టిక్కెట్ అవినాష్‌దే అనుకున్నారు.
– తాను రాష్ట్ర రాజకీయాల్లో ఉండాలి కాబట్టి.. పులివెందులలో అన్నీ చూసుకునేందుకు యువకుడైన అవినాష్‌రెడ్డిని జగన్‌గారు ఆనాడే అవినాష్ అభ్యర్థిత్వాన్ని డిసైడ్ చేశారు.
– తనకు అనువుగా, తన ప్రతినిధిగా అన్ని వ్యవహారాలు చూడగలిగిన వ్యక్తిగా అవినాష్‌రెడ్డిని జగన్‌గారు నిర్ణయించుకున్నారు.
– అలాంటప్పుడు అవినాష్‌కు టికెట్ ఇవ్వడం కోసమే, వివేకాను చంపారన్న ఆరోపణలో ఏ మాత్రమైనా లాజిక్ ఉందా?
– అందుకే వివేకా హత్యకు కారణాలు వేరుగా ఉన్నా.. సీబీఐ దర్యాప్తు ఏకపక్షంగా, ఒకే కోణంలో సాగుతోంది.
ఆ విషయం తప్పక బయటకు వస్తుంది:
– న్యాయస్థానాలపై పూర్తి గౌరవంతో వేచి ఉంటే, వ్యవస్థలను గౌరవించి, వాటికి లోబడి ఉంటే న్యాయమే గెలుస్తుంది.
– న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలవక తప్పదు. దానికి ఈ రోజు వచ్చిన తీర్పు మంచి పరిణామం.
– మిగిలిన కేసు ఎలాగూ నిలబడేది కాదు. అసలైన దోషులు తప్పక పట్టుబడతారు.
– రాజకీయంగా వివేకా కూతురు, అల్లుడు చేస్తున్న ప్రయత్నాలు కూడా రేపైనా బయటకు రాక తప్పదు.
– వాళ్లు ఎంతో కాలం ఆపలేరు. వారి వెనుక టీడీపీ ఎందుకుందో కూడా కాలక్రమేణ బయటకు వస్తుంది.
కోర్టులు ప్రభావితం అవుతాయా?:
– పచ్చ మీడియా అహంకారం, పొగరుతో వ్యవహరిస్తోంది.
– న్యాయస్థానాలు ఇండిపెండెంట్‌గా ఉంటాయని, ఉండాలనే కనీస సూత్రం కూడా వారు పాటించడం లేదు.
– జగన్‌గారు ఢిల్లీ వెళ్తే కోర్టులు ప్రభావితం అవుతాయా? అలా అనడం వల్ల న్యాయ వ్యవస్థ పట్ల వారికున్న అభిప్రాయం ఇదేనా? అనిపిస్తోంది.
– వారి వ్యవహారశైలి న్యాయ వ్యవస్థను కించపరుస్తోంది. దానికి పరాకాష్ట సస్పెండెడ్ జడ్జి వ్యాఖ్యలే.
– ఆ బురదలో రాళ్లు ఎందుకు వేయాలని మేము అనుకోవడం వల్ల ఎల్లో మీడియా మరింత రెచ్చిపోయి వ్యవహరిస్తోంది.
– అందుకే ఆ మీడియాలో అహంకారిపూరిత స్టేట్‌మెంట్లు వస్తున్నాయి. వినిపిస్తున్నాయి.
కొన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నా..:
– వివేకా హత్య స్థలం వద్ద కొన్ని ఆధారాలు స్పష్టంగా ఉన్నా.. రాజకీయ కోణం అని ప్రచారం చేయడంలో దురుద్దేశం కనిపిస్తోంది.
– అక్కడ దొరికిన లేఖను దాచిపెట్టమని వివేకా అల్లుడు చెప్పారు. దాని గురించి కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు కూడా చెప్పలేదు.
– వివేకా హత్య కేసులో ఆ లేఖ చాలా కీలకం. అలాగే ఆస్తి పత్రాలు మాట కూడా బలంగా వినిపిస్తోంది. కానీ సీబీఐ వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు.
– వివేకా సెకండ్ ఫ్యామిలీ అయిన షమీమ్ క్లియర్‌గా చెబుతోంది. తన కొడుకును వారసుడిగా ఆస్తి రాస్తారన్నారన్నది ఆమె మాట. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరగాల్సి ఉంది.
– ఇంకా వివేకా హత్యకు కోటి రూపాయలు ఇచ్చారని చెబుతున్న దాంట్లోనూ అనేక అనుమానాలు ఉన్నాయి.
– కేసులో ఏ–2గా ఉన్న సునీల్ యాదవ్ ఆ డబ్బులో 25 శాతం తీసుకున్నాడని చెప్తున్నారు. కానీ అతడి తల్లి తన స్టేట్‌మెంట్లో ఐదు వేల అప్పు చెల్లింపు విషయంలో ఇబ్బందిగా ఉందన్నారు.
– మరి అలాంటప్పుడు రూ.25 లక్షలు చేతిలో పెట్టుకున్నోడు ఐదు వేలు ఇవ్వలేడా?. కానీ సీబీఐ ఇలాంటివి చూడటం లేదు.
జడ్జీగారు కూడా లేవనెత్తారు:
– కొన్ని శక్తులు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ప్రభావితం చేస్తున్నాయని మేము అనదల్చుకోలేదు.
– అయితే కేసులో మరో కోణాన్ని ఎందుకు విస్మరిస్తున్నారనే మేము అడుగుతున్నాం.
– నిజానికి ఆ విషయాన్ని మేం ప్రస్తావించకపోయినా, కేసులో అరెస్టు అయిన శివశంకర్‌రెడ్డి వంటి బాధితులు లేవనెత్తుతున్నారు.
– అవన్నీ కోర్టు మందుకు వస్తున్నాయి. అందుకే అవే ప్రశ్నలను ఈరోజు జడ్జీగారు కూడా లేవనెత్తారు. మేం వ్యక్తం చేస్తున్న అనుమానాలే ఈరోజు కోర్టుకు కూడా వచ్చాయి.
యథేచ్ఛగా దస్తగిరి దందాలు:
– కేసులో అప్రూవర్‌గా మారి, బయటకు వచ్చిన దస్తగిరి ఇప్పుడు యథేచ్ఛగా దందాలు చేస్తున్నాడు.
– ఆయన వెనక చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణతో పాటు, ఢిల్లీలో ఒక రోగ్ ఎంపీ ఉన్నారు. ఇంకా ఇంతకు ముందు ఉన్నత పదవుల్లో ఉన్న వారు కూడా ఉన్నారు.
– అదో పెద్ద విష వలయం. వారందరి అండతోనే దస్తగిరి దందాలు చేస్తున్నాడు.
– ఆ విష వలయంలోని వారంతా కలిసి వందల కోట్లు ఖర్చు పెట్టి.. ఈ కేసును జగన్‌గారిపై ఒక పాశుపతాస్త్రంగా చేయాలని చూస్తున్నారు. అయితే వారెన్ని కుట్రలు చేసినా, చివరకు న్యాయమే గెలుస్తుందని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.