చట్టసభల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు  చేసిన సీఎం వైయస్‌ జగన్‌

ఇద్దరు మైనారిటీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం

చనిపోయిన ఎంపీ, ఎమ్మెల్సీల కుమారులకు చట్టసభలో స్థానం

టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టడం లేదు

కుప్పంలో ఓటమితో చంద్రబాబు అసహనంతో మాట్లాడుతున్నారు

స్వరూపానందేంద్ర స్వామిజీపై చంద్రబాబు వ్యాఖ్యలు సరికాదు

గతంలో స్వామీజీని చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కలిశారు

చంద్రబాబు భాష దారుణంగా ఉంది

తాడేపల్లి: చట్ట సభల్లో బడుగు, బలహీన వర్గాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రాధాన్యత కల్పించారని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆయన వెల్లడించారు. వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎంపిక చేసిన అభ్యర్థుల పేర్లను సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు ఘోర పరాజయం చెందడంతో చంద్రబాబు మతిభ్రమించి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్వామీజీలపై ప్రతిపక్ష నేత వ్యాఖ్యలు బాధాకరమన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు..
ఖాళీ అయిన ఆరు శాసన మండలి స్థానాలకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ తరఫున అభ్యర్థులను ఖరారు చేసినట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో ఆయన కుమారుడు బల్లి కళ్యాణ్‌ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుటుంబానికే అవకాశం కల్పించామన్నారు. చల్లా భగీరథరెడ్డిని సీఎం వైయస్‌ జగన్‌ ఎంపిక చేశారన్నారు. ఇక మైనారిటీ వర్గానికి చెందిన కరిమున్నిసా, మహ్మద్‌ ఇక్బాల్‌తో పాటు రామచంద్రయ్య, దువ్వాడ శ్రీనివాస్‌లను వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు వివరించారు. 

ఇద్దరు మహిళలకు చట్టసభలో స్థానం
వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఇది వరకు రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకీయా ఖానంను ఎమ్మెల్సీగా సీఎం వైయస్‌ జగన్‌ అవకాశం కల్పించారని, తాజాగా విజయవాడ నగరానికి చెందిన కరిమున్నిసాను ఎంపిక చేయడంతో చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందన్నారు. మహిళా సాధికారికతకు ఇదే నిదర్శనం అన్నారు. అలాగే మైనారిటీ వర్గం నుంచి ఇద్దరికి తాజాగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని, మైనారిటీల పట్ల వైయస్‌ జగన్‌కు ఉన్న చిత్తుశుద్ధికి ఇదే నిదర్శమని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ పెట్టడం లేదు
ఉపాధ్యాయ స్థానాలకు వైయస్‌ఆర్‌సీపీ తరఫున పోటీ పెట్టడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ స్థానాల్లో ఉపాధ్యాయులే అవకాశం కల్పిస్తున్నాం. పార్టీగా మేం పోటీ పెట్టడం లేదు. ఉపాధ్యాయ సంఘాలు నిలబెట్టిన అభ్యర్థులనే గెలిపిస్తే..వారి సమస్యలపై ^è ట్ట సభల్లో మాట్లాడే అవకాశం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. 

కుప్పంలో ఓటమితో బాబులో అసహనం
చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనలో అసహనం పెరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటమితో చంద్రబాబు అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కబంద హస్తాల్లో ఉన్న కుప్పం నియోజకవర్గ ప్రజలు ఆయనకు బైబై చెప్పారు. చంద్రబాబు మాటలు, హవాభావాలు  భయంకరంగా ఉన్నాయి. చంద్రబాబు అసలు స్వరూపం ఆయన మాటల్లో కనిపిస్తోంది. బయట, లోపల ఉండే వారు ఎలా ఉంటారంటే వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌ను చూస్తే అర్థమవుతుంది. కానీ చంద్రబాబును గమనిస్తే..ఆయన బయట ఒకలా, లోపల మరోలా ఉంటారని మేం చిన్నతనం నుంచి చూస్తున్నాం. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘో పరాభావం చెందడంతో చంద్రబాబు నిజస్వరూపం మళ్లీ బయటకు వచ్చింది. చంద్రబాబుకు వయసు మీద పడటంతో ఆయన మాటకు..చేతలకు పొంతన లేదు. హుందాతనం, సంస్కారం ఆయన మాటల్లో కనిపించడం లేదు. 

స్వామిజీల గురించి చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరం. చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రి స్థానంలో స్వరూపానందస్వామిని కలిశారు. ఆయనతో పాటు టీడీపీ ప్రముఖులు చాలాసార్లు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. స్వరూపానందస్వామి గురించి చంద్రబాబు కొన్ని కామెంట్లు చేశారు. ఆ రోజు చంద్రబాబు ఏ క్షుద్రపూజల కోసం, దొంగ పూజల కోసం వెళ్లారు. చంద్రబాబు మొదటి నుంచి రెండు నాల్కల ధోరణీ అవలంభిస్తారని అందరికీ తెలుసు. విధానపరమైన విమర్శలు అయితే బాగాను ఉంటాయి. కానీ స్వామీజీల గురించి చంద్రబాబు వ్యాఖ్యలు అసంబంధమైనవి. చంద్రబాబును ఎందుకు చంపుతారని ప్రశ్నించారు. ఇటీవల కుప్పం నేతలతో టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ..పెద్దిరెడ్డి, జగన్‌రెడ్డిలు అంటూ...పరుష పదజాలంతో మాట్లాడారట. ఇలా మాట్లాడుతున్నారంటే..తన మీద తనకు కంట్రోల్‌ లేదని స్పష్టమవుతుంది. చంద్రబాబు వైఖరి విచిత్రంగా ఉంది. ఖబడ్దార్‌ అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే..చంద్రబాబు చిన్న మెదడు చిట్లి మాట్లాడుతున్నట్లుగా ఉంది. 2019 ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన రోజు కూడా వైయస్‌ఆర్‌సీపీకి 151 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయి. అప్పుడు కూడా మేమే గెలిచామని చంద్రబాబు ప్రకటించాల్సింది. ఈ రోజు ఎందుకు మాట్లాడలేదో అర్థం కావడం లేదు. రేపు పరిషత్‌ ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఇదే కోణంతో మాట్లాడుతారేమో? ప్రజలకు నిజంగా చంద్రబాబు సేవ చేసి ఉంటే బంగారంగా ఎన్నుకునేవారు. నీవు ఏమీ చేయలేదు కాబట్టే..2019 ఎన్నికల్లో  నిన్ను దించి, వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకున్నారు. 

ఎన్నికల ముందు రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మోసం చేయలేదు. ప్రజలకు సేవ చేసి ఉంటే..నిన్ను మళ్లీ సీఎంగా ఎన్నుకునే వారు. వేరే సాకులు ఏవైనా వెతుక్కునే అవకాశాలు చూడాలి. అది చేయకుండా..తనకు తానుగా ఏదో ఊహించుకుని ఇష్టం వచ్చినట్లు పిచ్చి పరాకాష్టకు చేరినట్లుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు బూతులు తిడుతున్నారు. ప్రజలకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇలాంటి మాటలు మాకు రావు. చంద్రబాబు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబు తీరు గమనిస్తే..ఆయన ఒంటికే కాదు..తలకు కూడా రోగం ఉందని అర్థమవుతుంది. మాటల వల్ల ఓట్లు రావు. వచ్చే కాలంలో చంద్రబాబు ఇలాగే మాట్లాడుతుంటే రియాక్షన్‌ ఎక్కడో ఒక చోట వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

 

Back to Top