సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రలు

వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

నీచమైన రాజకీయాలకు పేరుగాంచిన ప్రతిపక్ష పార్టీ కుట్ర ఇది 

సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కుట్రపూరితంగా దుర్ఘటనలు

దేవాలయ సంఘటనలపై సిట్‌ విచారణ జరుగుతోంది

టీడీపీకి లబ్ధి చేకూర్చేలా నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్‌ ఇచ్చారు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్ణయాలు తీసుకున్నారు

2018లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎందుకు నిర్వహించలేదు

వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనేందుకు ఏకమవుతున్న శక్తులు

 
తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్న వరుస  పరిణామాలను గమనిస్తే..రాజకీయ శక్తుల ప్రమేయంతోనే జరుగుతున్నాయనిపిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.  సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కుట్రపూరితంగా జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఇలాంటి తరుణంలో కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని సిట్‌ వేసిందన్నారు. 2018లో నిమ్మగడ్డ రమేష్‌ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు. టీడీపీకి లబ్ధి చేకూరేలా ఇటీవల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారని విమర్శించారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

గత కొద్ది కాలంగా రాష్ట్రంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ..కోవిడ్‌ మహమ్మారి రాష్ట్రంలో ప్రవేశించి, ఒక సైకిల్‌ పూర్తి అయి, మరో సైకిల్‌ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం వ్యాక్సినేషన్‌కు సిద్ధమవుతోంది. కాగా, ఏడాదిన్నర కాలంలో వరుస సంఘటనలు గమనిస్తే..రెండు భిన్నమైన ఉద్ధంతాలు కనిపిస్తాయి. ఒక కో–ఆర్డినేటెడ్, కుట్రలో భాగంగా కొన్ని శక్తులు ఏకమవుతున్నాయన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఐసోలేటెడ్‌ ఘటనలు గమనిస్తే..వారం క్రితం వరకు టెంపుల్స్‌పై దాడులు చేశారు. అపచారాలు చేశారు. విగ్రహాలు ధ్వంసం చేశారు. ప్రజల్లో ఉన్న అతి సున్నితమైన మనోభావాలను దెబ్బతిసే పరిణామం చూశాం. ఆ రోజు సీఎం వైయస్‌ జగన్‌ ఓ కీలకమైన వ్యాఖ్యాలు చేశారు. ప్రభుత్వం ప్రజా బాహుల్యానికి ఎక్కువ మందికి ఉపయోగపడే పథకాన్ని ప్రారంభించే సమయంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కుట్ర పూరితంగా జరుగుతుందని దేవాలయాల దుర్ఘటనలను బట్టి చెప్పారు. నిజమే అని నాకు కూడా వారం రోజుల నుంచి అనిపిస్తోంది. 

దేశంలోనే ఎక్కడా, ఎప్పుడు జరగని విధంగా 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, 15 లక్షల ఇళ్ల నిర్మాణాలకు పునాదులు వేసే కార్యక్రమం గత నెల 25న ప్రభుత్వం మొదలుపెట్టింది. దాని వల్ల ప్రజల్లో వస్తున్న స్పందన, మహిళల ముఖాల్లో ఆనందం కనిపిస్తున్న తరుణంలో నీచమైన రాజకీయాలకు పేరుపొందిన ప్రతిపక్ష  పార్టీ, దాని ఏజెంట్‌ పార్టీలు అందరూ కలిసి కుట్ర పన్నారనే అనుమానం వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిట్‌ దర్యాప్తు కూడాకు ఆదేశించింది. 

అమ్మ ఒడి కార్యక్రమం నిన్న ఘనంగా నిర్వహించాం. రెండో ఏడాది కూడా బడికి పంపించే తల్లులకు రూ.15 వేల చొప్పున సీఎం వైయస్‌ జగన్‌ డబ్బు జమ చేశారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు.  తాజాగా కొత్త పరిణామాలకు తెర లేపారు. ఆలయాల దాడులు ఆగిపోయాయి. నిమ్మగడ్డ రమేష్‌ తెరపైకి వచ్చారు. మీడియాలో కూడా పంచాయతీ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చకు తెర లేపారు. ఒకప్పుడు ఒక వర్గం మీడియా జేడీ లక్ష్మీనారాయణ ను హైలెట్‌ చేసింది. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్‌ను పైకి లేపుతున్నారు.  గత మార్చి నుంచి రమేష్‌ వార్తల్లో ప్రధానంగా కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఒక పొలిటికల్‌ కార్యాలయంలో కూర్చొని ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసినట్లుగా ఆ నోటిఫికేషన్‌ ఉంది. అబ్జెటివ్‌గా నిర్ణయించిన తేదీలుగా నోటిఫికేషన్‌ లేదు. మొన్న దేవాలయాలపై జరిగిన దాడులు, నిన్న నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ చూసినా, భవిష్యత్‌లో మరొకటి సృష్టించినా కూడా ప్రజల దృష్టిని మరల్చేందుకే అని భావిస్తున్నాం. ప్రజలకు సంబంధం లేని అంశాలను తెరపైకి తెచ్చి ప్రభుత్వానికి మంచి పేరు రాకుండా కుట్రలు చేస్తున్నారు. గత ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలు అన్ని ఇలాగే ఉన్నాయి.

నిమ్మగడ్డ రమేష్‌ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ గమనిస్తే..ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. 2017లో ఆయన ఆ పదవిలోకి వచ్చారు. 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి, 2019లో మున్సిపల్‌ ఎన్నికలు జరగాలి. ఈ రెండు ఎన్నికలు నిమ్మగడ్డ నిర్వహించలేదు. ఆ రోజు టీడీపీ అధికారంలో ఉండగా పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమై మండల ఎన్నికలు నిర్వహించగా, వాటిని రద్దు చేసి, ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయంలో తెర వెనుక ఉన్నది ఎవరూ?. నిమ్మగడ్డ తన సొంత నిర్ణయాలతో ఇవన్నీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల పాటు మౌనంగా ఉండి..అమ్మ ఒడి ప్రారంభిస్తున్న నేపథ్యంలో నిమ్మగడ్డను బయటకు తెచ్చారు. రేపు తిరుపతి ఉప ఎన్నికల కోసం ప్రిఫైర్‌ అవుతున్నారు. దేవుడితో చెలగాటమాడుతున్న ఇతర శక్తులు, పార్టీలు అన్నీ కూడా 2009 దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి దుర్మారణం తరువాత ఏ విధంగా ఏకమయ్యాయో..ఇప్పుడు అలాగే వైయస్‌ జగన్‌ను టార్గెట్‌గా ఏకమవుతున్నారనే అనుమానాలకు తావిస్తోంది. మతం అన్న అతి సున్నితమైన అంశం, తిరుపతి ఉప ఎన్నికలు గమనిస్తే..ప్రశాంతమైన రాష్ట్రాన్ని వీరికి వదిలేస్తే ఎంత అన్యాయం జరుగుతుందో అన్న అనుమానం కలుగుతుంది. 

 

Back to Top