అనంతపురం జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ అవిర్భావ వేడుకలు

ysrcp formation day ananthpur

వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే పేదలకు న్యాయం

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి

అనంతపురం జిల్లాలో వాడవాడలా  వైయస్‌ఆర్‌సీపీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వం వర్ధిలాలని పార్టీ నేతలు,కార్యకర్తలు నినాదాలు చేశారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని  ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ పేదల పార్టీ అని, వైయస్‌ జగన్‌ సీఎం అయితే అన్నివర్గాలకు మేలు జరుగుతుందని వైయస్‌ఆర్‌సీపీ నేతలు తెలిపారు. 

Back to Top