తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఊరూరా వైయస్ఆర్‌సీపీ జెండాలను ఆవిష్కరించిన పార్టీ నేతలు మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పామర్రులో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 15 సవంత్సరాలుగా పోరాట బాటలో ప్రస్థానాన్ని సాగిస్తూ ఈ రోజు 15 వసంత లోకి అడుగు పెడుతున్న వేళ.. ఈ ప్రస్థానం లో పార్టీకి వెన్నంటి నిలిచిన నాయకులుకు,కార్యకర్తలకు, అభిమానులుకు,సోషల్ మీడియా కార్యకర్తలు కు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సామర్లకోట పార్టీ కార్యాలయంలో ఘనంగా వైయస్ఆర్‌సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ ఇన్‌చార్జ్ దవులూరు దొరబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పలాసలో వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వైయస్ఆర్‌సీపీ కార్యాలయం వద్ద పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. శృంగవరపు కోటలో వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మాజీ శాసనసభ్యులు కడుబండిశ్రీనివాసరావు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలిపారు. రాప్తాడులో దివంగత వైయస్ఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సాలూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్న దొర జెండాను ఆవిష్కరించారు. అనమయ్య జిల్లా రాయచోటి పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే అకేపాటి అమరనాధ్ రెడ్డి, పెద్ది రెడ్డి ద్వారకా నాధ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు చింతల, శ్రీకాంత్ రెడ్డి, కోరముట్ల శ్రీనివాసులు,మధన పల్లి నిసార్ అహమ్మద్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు జె కిషోర్ దాస్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వెల్లంపల్లి కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ జెండా ఎగరవేసి కట్ చేశారు. వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో విజయవాడ నగర్ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ లో తదితరులు పాల్గొన్నారు. రైల్వేకోడూరులో వైయస్ఆర్‌సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పార్టీ జెండాను ఎగురవేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీను ఆవిస్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్(పెదబాబు), మాజీ శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్సా అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పల నాయుడు, సంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు, కడుబండి శ్రీనివాసరావు, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజేష్ తలే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లా వివిధ అనుబంధ సంఘాలు నాయకులు పాల్గొన్నారు. పార్వతీపురం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక వైయస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ జెండాను జిల్లా పార్టీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు, పార్వతిపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి ఆవిష్కరించారు. అవనిగడ్డ లో వైయస్ఆర్‌సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పార్టీ జెండాను ఆవిష్కరించి బైక్ ర్యాలీ చేపట్టారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైయస్ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు.