వరదల్లోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి

బుడమేరు శాపం కచ్చితంగా చంద్రబాబుదే

మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ధ్వజం

భారీ వర్షాలపై ఐఎండీ ముందే హెచ్చరికలు

అయినా స్పందించని ప్రభుత్వం. అంతా నిర్లక్ష్యం

ఎక్కడా కనిపించని ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చర్యలు

బుడమేరు నిటి విడుదలపైనా ముందే సమాచారం

అయినా ప్రజలను అప్రమత్తం చేయలేదు!

మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆక్షేపణ

వరదల్లోనూ చంద్రబాబు రాజకీయం. పబ్లిసిటీ

మరోసారి అందరితో అదే పొగడ్తల పర్వం కొనసాగింపు

ప్రభుత్వ వైఫల్యం వల్లే విజయవాడలో వరద విపత్తు

ఇప్పుడు రోజూ పర్యటనలతో చంద్రబాబు డ్రామా. షో

బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ (బీడీసీ)కు శాపం చంద్రబాబే

బీడీసీ ఆధునికీకరణను పూర్తిగా వదిలేసిన చంద్రబాబు

ప్రెస్‌మీట్‌లో గుర్తు చేసిన సుధాకర్‌బాబు

తాడేపల్లి: విజయవాడను ముంచెత్తిన వరదల్లోనూ చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఏ మాత్రం తగ్గలేదని, రోజూ మందీ మార్బలంతో పర్యటిస్తూ.. సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలిగించడమే కాకుండా, బాధితులను అస్సలు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టం చేశారు. అంతే కాకుండా అందరితో పొగిడించుకుంటూ రోజూ డ్రామా, షో చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. బుడమేరు నీటి వల్లనే విజయవాడ మునిగిందన్న ఆయన, ఆ బుడమేరుకు కచ్చితంగా చంద్రబాబే శాపమని, బీడీసీ ఆధునికీకరణ పనులను ఆయన పూర్తిగా వదిలేశారని సుధాకర్‌బాబు వెల్లడించారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మీడియాతో మాట్లాడారు.

    గత నెల 28న వాతావరణ శాఖ (ఐఎండీ) రాష్ట్రంలో వర్షాలు, వరదలపై హెచ్చరిక చేసినా ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదని, దూసుకు వస్తున్న విపత్తుపై కనీసం సమీక్ష జరపలేదని సుధాకర్‌బాబు తెలిపారు. 30వ తేదీ నాటికే రాష్ట్రంలో పరిస్థితి మారిందని, ఆ మర్నాడు మధ్యాహ్నానికి ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తి, చంద్రబాబు అక్రమ నివాసం నీట మునిగిందని గుర్తు చేశారు. దీంతో కలెక్టరేట్‌కు మకాం మార్చిన చంద్రబాబు, విజయవాడ లోతట్టు ప్రాంతాల వారిని అస్సలు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కనీసం ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చర్యలు కూడా చేపట్టలేదన్న ఆయన, ఎగువన శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద ఫ్లడ్‌ వాటర్‌ కుషన్‌ ఎందుకు ఏర్పాటు చేసుకోలేదని ప్రశ్నించారు.
    మరోవైపు బుడమేరుపై ఉన్న వెలగలేరు రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తుతామని గత శనివారం ఉదయమే, అధికారులందరికీ సమాచారం ఇచ్చామని, ఆ నీరు విజయవాడ చేరడానికి 20 గంటల సమయం పడుతుందని ఆ ప్రాజెక్టు డీఈ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. అంత సమయం ఉన్నా ప్రజలను ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించారు. రిలీఫ్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి నగరంలోని లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు ఎందుకు తరలించలేదని నిలదీశారు. అందుకే ఇప్పుడు జరిగిన మరణాలకు, లక్షల మందికి జరిగిన నష్టానికి చంద్రబాబే కారణమని తేల్చి చెప్పారు.
    చంద్రబాబు వ్యవహారశైలి దారుణంగా ఉందన్న ఆయన, నాటి గోదావరి పుష్కరాల ఘటన గుర్తుకొస్తోందని చెప్పారు. విజయవాడను వరద ముంచెత్తి దాదాపు వారం కావొస్తున్నా, పరిస్థితి ఇప్పటి వరకు ఎక్కడా కుదుట పడలేదని, బాధితులకు నరకం తప్పడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు 47 మంది చనిపోయినట్లు తెలుస్తున్నా, వాస్తవ సంఖ్య చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పారు.
    ఇప్పుడు కూడ బుడమేరుపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే, 2014–19 మధ్య అధికారంలో ఉన్నప్పటికీ బుడమేరు మళ్లింపు కాలువ (బీడీసీ) ఆధునికీకరణ ఎందుకు చేపట్టలేదని గట్టిగా నిలదీశారు. బీడీసీపై ఉన్న యాక్టివ్‌ పవర్‌ ప్లాంట్‌ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణది కాదా? అని సూటిగా ప్రశ్నించిన సుధాకర్‌బాబు, కేవలం ఆయన కోసమే, బీడీసీ ఆధునికికరణను గాలికొదిలేశారని ఆక్షేపించారు.
    ఇప్పటికైనా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి మాని, విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని, చేసిన తప్పిదాలకు ప్రజలను క్షమాపణ కోరాలని టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. అంత మంది మరణానికి, ఇన్ని లక్షల మంది బాధలకు కారణమైన చంద్రబాబు, తాను  సీఎం పదవిలో ఉండడానికి అసలు అర్హుడినేనా? అన్న విషయాన్ని ఒకసారి స్వయంగా సమీక్షించుకోవాలని కోరారు.

Back to Top