తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి వైయస్ఆర్‌సీపీ నేతలు పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం గొప్పతనాన్ని పార్టీ నేతలు కొనియాడారు. వైయస్ఆర్‌సీపీ నాయకులు ఏమన్నారంటే..వారి మాటల్లోనే.. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కల్గిస్తున్న కూటమి ప్రభుత్వం: లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ. మన దేశంలో పలు మతాలు, కులాలు ఉన్నాయి. ఆయా మతాలకు ప్రామాణిక గ్రంధాలు కూడా ఉన్నాయి. హిందువులకు భగవద్గీత, క్రై స్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ పవిత్ర గ్రంధాలుగా ఉన్నాయి. కానీ భారతీయలందరికీ ఉన్న ఏకైక ప్రామాణిక గ్రంధం మాత్రం డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం మాత్రమే. అయితే దురదష్టవశాత్తూ దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగస్ఫూర్తికి విఘాతం కలిగించేలా.. మాకు కావాల్సింది భారత రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అధికార తెలుగుదేశం పార్టీ పాలన సాగిస్తోంది. రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడ కొనసాగాలి. దీనికోసం వైయస్.జగన్ నేతత్వంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎన్ని అడ్డంకులు, నిర్భంధాలు ఎదురైనా... డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగస్ఫూర్తిని ముందుకు తీసుకెళతాం. బ్రిటీష్ పాలనను తలపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం: టీజేఆర్ సుధాకర్ బాబు, వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించుకోవడం సంతోషం. భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ చేసిన రచనలతో అందరికీ సమానమైన న్యాయం దక్కాలని... జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా సామాజిక వర్గాలకు సముచిత స్ధానం ఉండాలని, రిజర్వేషన్ల ప్రక్రియ ఉండాలి, ఆణగారిన వర్గాలకు ఆర్ధిక, రాజకీయ స్వాతంత్య్రం ఉండాలని విప్లవాత్మకమైన రచనలతో, అందరి ఆమోదంతో ఈ రోజున భారత రాజ్యాంగాన్ని భారత ప్రభుత్వం తీసుకుంది. జనవరి 26న దాన్ని అమలు పరిచింది. ఇంతటి ఘనమైన రోజున... ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దురదృష్టవశాత్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు నాయుడు రాచరిక పాలనను మళ్లీ తీసుకొచ్చాడు. బ్రిటీష్ వాళ్లు భారతీయలును ఉక్కుపాదంతో అణిచివేచినట్లు, భారతగడ్డమీద పుట్టిన వాళ్లకు మానవహక్కుల ఉల్లంఘన ఎలా జరిగిందో? సంఘ బహిష్కరణ చేసి ఎలా జైలు పాలు చేశారో? అదే తరహా బ్రిటీష్ పరిపాలన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తోంది. వైయస్.జగన్ తీసుకొచ్చిన రాజకీయ, ఆర్ధిక స్వావలంభన, సంస్కరణలు ఇవాళ మచ్చుకైనా మన రాష్ట్రంలో కనిపించడం లేదు. ప్రాథమిక హక్కులు హరిస్తున్న కూటమి ప్రభుత్వం: కొమ్మూరి కనకారావు, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్. కులం, మతం, ఆర్దిక, సామాజిక వ్యత్యాసాలు లేకుండా మనుషులు అంతా ఒక్కటిగా ఉండాలి అని తీర్చిదిద్దేందుకే రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగం ఆమోదిస్తూ 75 ఏళ్లు పూర్తైనా... కులం, మతం, ప్రాంతం, దళారులతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందే పరిస్థితి కేవలం వైయస్.జగన్ పరిపాలనలో మాత్రమే. బ్రిటీష్ పాలన మరోసారి పునరావతం అవుతున్న పరిస్థితులు మరలా రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. పౌరులకు ప్రాధమిక హక్కులు... విద్య, వైద్యం అందిననాడే రాజ్యాంగలక్ష్యం నెరవేరుతుందన్న ఉద్దేశంతో వైయస్.జగన్ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో అవన్నీ ప్రైవేటు పరం అవుతున్న దుస్థితి. ఈ నేపధ్యంలో మరలా పేదలకు మరలా రాజ్యాంగ ఫలాలు దక్కాలంటే వైయస్.జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి అందరం ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో దార్శినికుడు అంబేద్కర్ కూ అవమానం: నందిగం సురేష్, మాజీ ఎంపీ. అందరికీ రాజ్యంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు. రెండేళ్లు దాటినా కూటమి ప్రభుత్వం వైఖరిలో ఇప్పటికీ కూడా ఎలాంటి మార్పు లేదు. ఈ మధ్య కాలంలో అంబేద్కర్ స్మృతివనం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. తాగి పడేసిన మంచినీళ్ల సీసాలు, చెత్తాచెదారంతో నిండిపోయింది. సందర్శకులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారు. కరెంటు తీసేస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమాన పరుస్తున్నారు. ఎవరెన్ని అవమానాలు చేసినా అంబేద్కర్ గారి గౌరవం ఏమీ తగ్గదు. ఆయన దళితుడని చిన్నచూపు చూడవచ్చు. ప్రపంచ దేశాలన్నీ ఆయన్ను దేవుడని, ప్రపంచ మేధావి అని చెప్పుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. దాన్ని ఎవరూ మార్చలేదు. అసూయతో ఒక దళితుడు రాసిన రాజ్యాంగంలో ఉంటున్నామని బాధపడుతున్నారనే కానీ.. దాన్ని ఏ శక్తీ మార్చలేదు. దాన్ని తిరిగి కొనసాగించాలంటే మరలా వైయస్.జగన్ అధికారాన్ని చేపట్టాలి. అప్పుడే అంబేద్కర్ గారికి ఆ గౌరవం వస్తుంది. రాజ్యాంగానికి కట్టుబడి ఐదేళ్ల పాలన చేసిన ఏకైక వ్యక్తి వైయస్.జగన్. అలాంటి సంక్షేమ పాలన కొనసాగాలి. వైయస్.జగన్ పాలనలో పోలీస్ శాఖ గర్వంగా తలెత్తుకుని పని చేసింది. అంబేద్కర్ స్పూర్తితో సంక్షేమ ఫలాలు అందించిన ఘనత వైయస్ కుటుంబానిదే: మేరుగు నాగార్జున, మాజీ మంత్రి. ఇవాళ రాజ్యాంగ ఆమోద దినోత్సవం. భారతదేశ రాజకీయ వ్యవస్థలోనే ప్రత్యేకమైన రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పొందుపరిచి, దేశం విచ్ఛిన్నం కాకుండా భావితారల భవిష్యత్తును ముడివేసి, దాన్ని దేశానికి అంకితం చేయడంతో పాటు అమలు చేసిన రోజు. అంబేద్కర్ గారి రాజ్యాంగ వ్యవస్థను ప్రజాస్వామ్య యుతంగా తీసుకువెళ్తున్న తరుణంలో.. సమాజంలో అంతరాలు తగ్గాలి. రుగ్మతలను రూపుమాపాలి. సమాజంలో ఉన్న అట్టడుగు కులాల స్థితిగతులు పెరగాలి. రాజ్యాంగంలో బాబాసాహెబ్ కోరుకున్నట్టు.. అప్ లిప్ట్ అనేది జరగాలి. కానీ వ్యవస్ధలో రిజర్వేషన్లు వచ్చాయి, పేదవాడి స్ధితి పెరగడానికీ అవకాశాలు వచ్చాయి, బ్రతకడానికి మాకు హక్కు ఉందని బాబాసాహెబ్ ఇచ్చాడనే దైర్యం కూడా ఉంది కానీ ప్రభుత్వాలలో కొంత శీతకన్ను మాత్రం తగ్గలేదు. వైయస్.జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత బాబాసాహెబ్ అలోచన విధానాన్ని తూచా తప్పకుండా అమలు చేసి, పేదవాళ్ల స్థితిగతులు పెంచారు. వాళ్లు గుండెల మీద నిశ్చింతంగా చేయి వేసుకుని బ్రతికే విధంగా అవకాశాలు కల్పించారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా అందరినీ అప్ లిఫ్ట్ చేస్తూ... ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అంబేద్కర్ గారి ఆలోచనా విధానాన్ని అమలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్.