అలుపెర‌గ‌ని ప్ర‌యాణంతో తిరుగులేని శ‌క్తిగా వైయ‌స్ఆర్ సీపీ 

ఇద్ద‌రితో మొద‌లై.. మ‌హా వృక్షంగా ఎదిగిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 

మ‌హానేత వైయ‌స్ఆర్ ఆశ‌య సాధ‌నే ధ్యేయంగా అడుగులు

అతి త‌క్కువ స‌మ‌యంలోనే అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌

ప్ర‌జా ప్ర‌భుత్వం ఏర్పాటుతో స‌క‌ల జ‌నుల‌కు సంక్షేమ ప‌థ‌కాలు

ప్ర‌జానాయ‌కుని నాయ‌క‌త్వంలో 13వ వసంతంలోకి వైయ‌స్‌ఆర్ సీపీ

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈ జెండా ఐదున్న‌ర కోట్ల ఆంధ్ర‌రాష్ట్ర ప్ర‌జ‌లకు కొండంత అండ‌.. 135 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిందీ జెండా.. అధికారమ‌నే ఆయుధంతో అరాచ‌కాలు సాగిస్తున్నవారికి ఎదురొడ్డి పోరాడిందీ జెండా.. దోపిడీదారుల చెర నుంచి ఆంధ్ర‌రాష్ట్రాన్ని విముక్తి చేసిందీ జెండా.. ద‌శాబ్దాల అణ‌చివేతతో చీక‌ట్లో మ‌గ్గుతున్న వ‌ర్గాల‌ను చెయ్యి ప‌ట్టుకొని వెలుగువైపు న‌డిపిస్తోందీ.. నిశ‌బ్ద‌ నిశీధి నుంచి ఉషోద‌యంలా వెలుగులు చిమ్ముతోందీ జెండా.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు సువ‌ర్ణపాల‌న‌ను అందించిన మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆశ‌య సాధ‌న కోసం, ప్ర‌జ‌ల కోసం పురుడోసుకున్న ఈ జెండా.. 12 వ‌సంతాల‌ను పూర్తి చేసుకొని 13వ వ‌సంతంలోకి అడుగుపెడుతోంది.. న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌నంగా నిలిచి.. నేడు ప్ర‌తి ఇంట్లో చిరున‌వ్వుల వెలుగులు పూయిస్తోంది..

యువ‌జ‌న శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైయ‌స్ఆర్ సీపీ) ఇడుపుల‌పాయ‌లో దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మాధి సాక్షిగా 2011 మార్చి 12వ తేదీన జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నాయ‌క‌త్వాన  ఆవిర్భ‌వించింది. ద‌శాబ్ద కాలానికి పైగా ఎన్నో స‌వాళ్లు, ఆటుపోట్ల‌ను ఎదుర్కొని నేడు దేశ రాజకీయాల్లో త‌న‌కంటూ ఓ ఖ్యాతిని, కీర్తిని సంపాదించుకుంది వైయ‌స్ఆర్ సీపీ. విలువ‌లు, విశ్వ‌స‌నీయ‌తే సిద్ధాంతాలుగా పార్టీని స‌మ‌ర్థ‌వంతంగా న‌డిపి, ప్ర‌జ‌ల్లో ఒక బ‌ల‌మైన న‌మ్మ‌కాన్ని, ధృడ‌మైన విశ్వాసాన్ని ఏర్ప‌రుచుకున్నారు వైయ‌స్ జ‌గ‌న్‌.  

జాతీయ పార్టీని ఎదురించి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు తల్లి వైయస్‌ విజయమ్మతో కలిసి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్థాపించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేడు మహా వృక్షంగా ఎదిగి ఎందరికో రాజకీయ భవిష్యత్‌ ఇస్తోంది. నేడు కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించింది. పార్లమెంట్‌లోనే అతిపెద్ద పార్టీల సరసన చేరింది. 

వైయస్‌ జగన్‌ నిజమైన ప్ర‌జానాయకుడు..
జన హోరుని చూసి మైమరచిపోయి తొడగొట్టే హీరో కాదాయన. ఇచ్చిన మాట మీద నిలబడే నిజమైన నాయకుడు. తన తండ్రి పేరు చెప్పుకుని కాయలమ్ముకుంటున్నవాళ్లు ఆ చెట్టు మీదే రాళ్లేస్తుంటే సహించలేకపోయిన నిజమైన వారసుడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ఇసుమంతైనా తెలీని శక్తులు తనపైనా, తన విశ్వాసాలపైనా ఆధిపత్యం చెలాయించబోతే ఎదురు తిరిగిన నిజమైన విప్లవకారుడు. అందుకే ఇప్పుడు వైయ‌స్ జ‌గ‌న్ ఒక హీరో. కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానిస్తున్న నిజమైన ప్ర‌జానాయకుడు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి రేప‌టికి సరిగ్గా పన్నెండేళ్లు పూర్త‌యి 13వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతోంది. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, వైయస్‌ విజయమ్మతో ప్రారంభమైన ఓ పార్టీ నేడు దేశంలోని అతిపెద్ద పార్టీల సరసన చేరింది. రాష్ట్ర చరిత్రలోనే 51 శాతం ఓట్లు, 80 శాతం పైగా సీట్లతో 2019లో జరిగిన ఎన్నికల్లో అఖండ మెజారిటీ సాధించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 151 స్థానాలతో, భారత లోక్‌సభలో 22 స్థానాలతో అత్యున్నత ఫలితాలు అందుకుంది. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. 

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఈ మూడున్న‌రేళ్ల కాలంలో చరిత్రాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక చట్టాలు చేసి ప్రజా రంజక పాలన అందించి బెస్ట్‌ ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. స్కోచ్ అవార్డులు అందుకున్నారు. విద్యా, ఆరోగ్యం, వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు అన్నింటి 50 శాతం రిజర్వేషన్లు కల్పించి చరిత్మాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సంక్షేమ పథకాలను గడప వద్దకే చేర్చి ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నారు. పార్టీ జెండా మోసే కార్య‌క‌ర్త‌లు కాల‌ర్ ఎగ‌రేసుకొని ఇత‌నే మా నాయ‌కుడు అని గ‌ర్వంగా చెప్పుకునేలా ప‌రిపాల‌న సాగిస్తున్నారు. యావ‌త్ దేశం ప్ర‌శంస‌న‌లు అందుకుంటున్నారు. జ‌న‌మే త‌న బ‌ల‌మ‌ని, జ‌నం కోస‌మే త‌న ప‌య‌న‌మ‌ని అలుపెర‌గ‌ని శ్రామికుడిలా వారి బాగుకోస‌మే శ్ర‌మిస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌కు జ‌న‌మంతా జేజేలు కొడుతున్నారు. అందుకు అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో.. తానేం చేయాలో నిర్ధిష్ట‌మైన ల‌క్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ అడుగులు ముందుకే ప‌డుతున్నాయి. 

రాకాసి మూక‌లు రాజ్యాధికారం కోసం ఎన్ని న‌క్క‌జిత్తులు, కుట్ర‌లు కుతంత్రాలు ప‌న్నినా త‌న‌దైన వ్యూహంతో ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూనే ఉన్నారు. వారి నీచ‌బుద్ధిని జ‌నానికి తెలియ‌జేస్తూనే ఉన్నారు. త‌న అస్థిత్వాన్ని దెబ్బ‌తీయాల‌ని అంద‌రూ ఏక‌మై స‌మూహంలా విష ప్ర‌చారాలు చేస్తున్నా ఏమాత్రం జంకు లేకుండా.. తాను న‌మ్ముకున్న ప్ర‌జ‌ల కోసం వాట‌న్నింటిని చిరున‌వ్వుతోనే భ‌రిస్తూ మేరున‌గ‌ధీరుడిలా ప‌రిపాల‌న సాగిస్తున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎప్ప‌టికీ వీరుడే.. విజ‌య‌సార‌ధుడే.. జ‌న‌నాయ‌కుడే..

అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ప్ర‌జా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని ల‌క్ష్యంగా పెట్టుకొని ప‌రిపాల‌న సాగిస్తున్నారు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌. ఆయ‌న వేసే ప్ర‌తి అడుగూ భ‌విష్య‌త్తు త‌రాల బాగుకోస‌మే.. విజ‌న్ ఉన్న‌ నాయ‌కుడి ఆలోచ‌న‌లను అందుకోవ‌డం అంత సులువు కాదు.. వాటి ఫ‌లాలు అందుకున్న‌ప్పుడే ఆ నాయ‌కుడు తీసుకున్న‌ నిర్ణ‌యాల వెన‌కున్న మ‌ర్మం అవగ‌తమ‌వుతుంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు నాడు-నేడుతో బాగుచేస్తుంటే ప్ర‌త్య‌ర్థులంతా హేళ‌న‌గా మాట్లాడారు. ఆస్ప‌త్రుల‌ను రిపేర్ చేస్తుంటే న‌వ్వుకున్నారు. కానీ, ముఖ్య‌మంత్రి బాగు చేసిన ప్ర‌భుత్వ బ‌డులు.. నేడు పేద పిల్ల‌ల‌కు స‌రస్వ‌తి నిల‌యాల‌య్యాయి. ఆస్ప‌త్రులు ఎంద‌రో అభాగ్యుల‌కు పున‌ర్జ‌న్మ‌నిస్తున్నాయి. క‌రోనా మ‌హ్మ‌మారి విల‌యం సృష్టించిన‌ప్పుడు ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడింది ఈ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులే.

ఒక‌ప్పుడు సంక్షేమ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు ఎలా చేసుకోవాలో తెలియ‌ని స్థితి నుంచి నేడు మాకా ప‌థ‌కం ఎందుకు రావ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ప్ర‌శ్నించేంత చైత‌న్య‌న్ని తీసుకువ‌చ్చారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యం, వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ ద్వారా గ్రామ స్వ‌రాజ్యాన్ని సాకారం చేశారు. నిరుపేద‌ల గ‌డ‌ప వద్ద‌కే పాల‌న‌ను చేర్చారు. అవినీతిని రూపుమాపుతూ, వివ‌క్ష‌కు చోటులేకుండా అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమ ఫ‌లాలు అందేలా డీబీటీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫ‌ర్‌) సిస్ట‌మ్‌ను తీసుకువ‌చ్చారు. ముఖ్య‌మంత్రి బ‌ట‌న్ నొక్కిన వెంట‌నే నేరుగా ల‌బ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అయ్యే వ్య‌వ‌స్థ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ మూడున్న‌రేళ్ల పాల‌న‌లో రూ.1.93 లక్షల కోట్లు (డీబీటీ) కేవలం బటన్‌ నొక్కడం ద్వారా నేరుగా  అక్కచెల్లెమ్మల బ్యాంక్‌ అకౌంట్‌లోకి డబ్బులు జమ చేశారు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు వెన్నుద‌న్నుగా నిలుస్తూ.. రాజ్యాధికారంలో సింహభాగం అవ‌కాశాలు క‌ల్పిస్తూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌ను రాజ‌కీయ సాధికార‌త వైపు చెయ్యిప‌ట్టుకొని న‌డిపిస్తూ.. సామాజిక న్యాయాన్ని చేత‌ల్లో చూపిస్తూ.. సంఘ సంస్క‌ర్త‌గా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నిలుస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top