16 నుంచి వైయస్‌ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మొదటి ప్రచార  సభ

ప్రచారంలో పాల్గొననున్న వైయ‌స్ విజయమ్మ, వైయ‌స్ షర్మిల

ఇడుపులపాయలో అభ్యర్థుల ప్రకటన

 వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి తలశిల రఘురాం

హైదరాబాద్‌: గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోవైయస్‌ఆర్‌సీపీ మెట్టమొదటి ఎన్నికల ప్రచార స‌భ‌ ప్రారంభం కానుందని వైయస్‌ఆర్‌సీసీ అధికార ప్రతినిధి తలశిల రఘురాం తెలిపారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గత 14 నెలలుగా 13 జిల్లాలో 134 నియోజకవర్గాల్లో పర్యటించారన్నారు.కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం లేకపోయిన మరోసారి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వైయస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడానికి ప్రచార ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌,  వైయ‌స్ ష‌ర్మిల‌మ్మ ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు.నామినేషన్ల అనంతరం వేర్వేరుగా ప్రచారం చేస్తారన్నారు.16న  నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభ ఉంటుందని,25వ తేదీ తర్వాత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బస్సు యాత్ర ద్వారా రోజుకు నాలుగు నియోజకవర్గాలు పర్యటిస్తారని తెలిపారు.ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో వైయస్‌ జగన్‌ పర్యటిస్తారని తెలిపారు. పూర్తి పర్యటన వివరాలో రెండు,మూడు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు.ఇడుపుల పాయ వైయస్‌ఆర్‌ ఘాట్‌లో నివాళర్పించి ప్రచారానికి శ్రీకారం చూడతారన్నారు. ఇడుపులపాయలోనే వైయస్‌ జగన్‌ అభ్యర్థులను ప్రకటిస్తారని తెలిపారు.

Back to Top