పయ్యవులపై చర్యలు తీసుకోవాలి

ఈసీకి వైయస్‌ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు
 

అనంతపురం: పోస్టల్‌ బ్యాలెట్‌లో అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ ఉరవకొండ అసెంబ్లీ అభ్యర్థి పయ్యవుల కేశవ్‌పై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు డిమాండు చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్‌కు పయ్యవుల కేశవ్‌పై వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో మరణించిన రిటైర్డ్‌ ఉద్యోగి ఆంజనేయులుకు అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ పంపించారు. ఆంజనేయులు కుటుంబ సభ్యులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వెనక్కి పంపించారు. ఆంజనేయులు 14 ఏళ్ల క్రితం రిటైర్మెంట్‌ అయ్యారు. నాలుగు నెలల క్రితం చనిపోయారు. మరణించిన వ్యక్తికి పోస్టల్‌ బ్యాలెట్‌ పంపడం పట్ల కుటుంబీకులు విస్మయం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల కనుసన్నల్లో కొందరు అధికారులు 50 మందికి డబుల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు జారీ చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేత పయ్యవుల కేశవ్‌పై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top