విజయవాడ: రేణిగుంట ఎయిర్ పోర్టులో కోడ్ ఉల్లంఘించి ధర్నా చేస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎస్ఈసీనే కేసు నమోదు చేయాలని వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంకంరెడ్డి నారాయణ మూర్తి కోరారు. సోమవారం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో నారాయణమూర్తి పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వాలంటీర్లపై నిషేధం పెట్టొద్దని ఎస్ఈసీని కోరినట్లు చెప్పారు. వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా ఎస్ఈసీ వ్యవహరించొద్దని సూచించామన్నారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకోవద్దని కోరామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పని చేస్తున్నారని చెప్పారు. పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్ చేసుకుంటామనే రీతిలో నిమ్మగడ్డ చెప్పారన్నారు. వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను టీడీపీ చేస్తున్న దాడులను కంట్రోల్ చేయాలని నిమ్మగడ్డ రమేష్ ను కోరినట్లు చెప్పారు.