అమరావతి: ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని వైయస్‌ఆర్‌సీపీ నేతలు కలిశారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి అనుకూలంగా ఈసీలో కొంత మంది పని చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఇంటలీజెన్స్ అండతోనే అబ్జెక్టు ఏజెన్సీ ఈసీలోకి చొరబడిందని ఆయన పేర్కొన్నారు. ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశామని నాగిరెడ్డి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం ప్రలోభాలకు పాల్పడుతున్న టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. సబ్బం హరి ప్రలోభాలకు గురి చేసిన ఆడియో టేపులను ఈసీకి అందజేశారు.