ఢిల్లీ:డీజీపీ ఠాకూర్,ఇంటెలిజెన్స్ ఏడీజీ వెంకటేశ్వరరావు,యోగానంద్‌లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘంతో వైయస్‌ఆర్‌సీపీ పార్టీ నేతలు భేటీ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు.నాన్‌క్యాడర్ అధికారులకు నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారని,ఏపీ డీజీపీగా ఠాకూర్ ఉన్నంతకాలం ఎన్నికలు సజావుగా జరగవన్నారు.బాబు సామాజికవర్గానికి చెందిన అధికారులకే పదోన్నతులు కల్పించారన్నారు. ఓటర్ల జాబితా నుంచి వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులను ఎలా తొలగించారో ఎన్నికల సంఘానికి వివరించినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సమ్మేళనం నిర్వహించి పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాశాంతి పార్టీ గుర్తు మార్పు విషయంలో రివ్యూ పిటిషన్ వేశామన్నారు.హెల్టికాప్టర్ గుర్తుపై మా అభ్యంతరాలను సీఈసీకి వివరించామన్నారు.