వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో 11 గంట‌ల‌కు సంతాప కార్య‌క్ర‌మం

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి దిగ్ర్భాంతి

తాడేప‌ల్లి:  రాష్ట్ర మంత్రివ‌ర్యులు  మేక‌పాటి గౌతంరెడ్డి  అకాల మ‌రణం మ‌న అంద‌రిని దుఃఖ స‌ముద్రంలో ముంచింద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే లేళ్ల అప్పిరెడ్డి దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. గౌత‌మ్‌రెడ్డికి నివాళులు ఆర్పించేందుకు తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యం సోమవారం ఉద‌యం 11 గంట‌ల‌కు సంతాప కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసిన‌ట్లు అప్పిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, ప్ర‌జాప్రతినిధులు సంతాప కార్య‌క్ర‌మంలో పాల్గొని గౌత‌మ్‌రెడ్డికి నివాళుల‌ర్పించాల‌ని ఆయ‌న కోరారు.  

Back to Top