తాడేపల్లి: డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ సామాజ శ్రేయస్సు కోసం తన జీవి తాన్ని ఆర్పించిన మహానీయుడని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజ సేవకు అంకి తమవ్వాలని చీఫ్ డిజిటల్ డైరెక్టర్లు గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి, సీపీ రెడ్డి పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని మంగళవారం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్రప్రసాద్, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలకు వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ చేసిన కృషిని వారు కొనియాడారు. సుదీర్ఘకాలం పరాయి పాలనలో మగ్గిన భారతదేశానికి ఎందరో స్వాతంత్ర్యసమరయోధుల త్యాగ ఫలితాలతో 1947 ఆగస్టు 15న స్వతంత్ర భారత్‌గా అవతరించిందన్నారు. కోట్లాదిమంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారధిగా డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటైందన్నారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మేళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారని తెలిపారు. రాజ్యాంగమంటే కేవలం ప్రభుత్వ విధివిధానాలు, శాసనసభల రూపకల్పనే కాదు కోట్లాది పీడిత ప్రజల ఆశయాలను ప్రతిబింభించాలన్నది ఆయన ప్రధానాశయమన్నారు. ఆయన కృషి ఫలితంగానే ప్రపంచంలోనే కొత్తదైన రాజ్యాంగం రూపుదిద్దుకుందని, అందుకనే ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాల కంటే భారతరాజ్యాంగం ఉన్నతవిలువలు కలిగిందంటూ మన్ననలు పొందిందని వివరించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందని, జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమలులోకి వచ్చిందన్నారు. నవంబర్ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అంబేద్కర్ ఆలోచన విధానంతో రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ..కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. విద్యా, వైద్యానికి పెద్ద పీట వేసి అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుతున్నారని పేర్కొన్నారు. Read Also: ఇన్నాళ్లూ వచ్చిన డబ్బును నొక్కేశారా బాబు?