ఆత్మకూరు అభివృద్ధికి కృషిచేస్తా..

నామినేష‌న్ దాఖ‌లు చేసిన వైయ‌స్ఆర్ సీపీ అభ్య‌ర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి

నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి చిత్ర‌ప‌టానికి నివాళుల‌ర్పించిన విక్ర‌మ్‌రెడ్డి.. వారి తల్లిదండ్రుల చేతులు మీదుగా నామినేష‌న్ ప‌త్రాలు అందుకొని, వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంత‌రం భారీ ర్యాలీతో ఆర్డీఓ కార్యాల‌యం వ‌ర‌కు వెళ్లి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అనంత‌రం పాత మున్సిప‌ల్ ఆఫీస్ వ‌ద్ద విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకొని పనిచేస్తామన్నారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. విక్ర‌మ్‌రెడ్డి వెంట పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ఉన్నారు.

అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధికి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విశేష కృషిచేశారని గుర్తుచేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే వైయస్‌ఆర్‌ సీపీని గెలిపిస్తాయన్నారు. 
 

Back to Top