ప్రతి వ్యక్తికి కంటి చూపు ఇవ్వాలన్నదే సీఎం వైయస్‌ జగన్‌ ఆశయం

పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ 
 

విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి కంటి చూపు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇవాళ విశాఖలో వైయస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో   మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ..  ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం నోవాటెల్‌లో మీటింగ్‌లు నిర్వహిస్తే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం ప్రజల మధ్యే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. గాజువాక  అగనంపుడిలో 800 కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ మాట్లాడుతూ... వైయస్‌ఆర్‌ కoటి వెలుగుకు మద్దతుగా తాను నేత్ర దానం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, వీఎమ్మార్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, వైయస్‌ఆర్‌ సీపీ కన్వీనర్లు అక్కరమని విజయ నిర్మల, మళ్ళ విజయ ప్రసాద్, కోలా గురువులు, విశాఖ జిల్లా వైద్యాధికారి తిరుపతి రావు, జీవీఎంసీ కమిషనర్  సృజన, జాయింట్ కలెక్టర్‌ శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top