స్మృతివ‌నంలో ఘ‌నంగా వైయ‌స్ఆర్ జ‌యంతి వేడుక‌లు

నంద్యాల‌: న‌ల్ల‌కాల్వ స‌మీపంలోని వైయ‌స్ఆర్ స్మృతివ‌నంలో  దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. శ్రీ‌శైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ పట్టణ అధ్యక్షులు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ అంజాద్ అలీ, జిల్లా రైతు సలహా మండలి బోర్డు మెంబర్ రాజమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత  మహానేత, రైతు బాంధవుడు, అపర భగీరధుడు, విద్యాప్రదాత, ఆరోగ్యప్రదాత అయినటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా కేక్ క‌ట్ చేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్యక్రమంలో నల్ల కాలువ రాజేష్, రైతు సంఘం అధ్యక్షులు మహబూబ్ బాషా, వెంకట స్వామి గౌడ్, అశ్వక్ అలీ, షాహిద్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top