ఓటు హక్కు వినియోగించుకున్న వైయస్‌ఆర్‌ కుటుంబం

పులివెందుల: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని భాకారాంపురంలోని ఎంపీపీఎస్‌ స్కూల్‌లో ఓటు వేశారు. అంతకు ముందు పులివెందులలోని నివాసంలో వేదపండితులు ఆశీర్వాదం అందుకున్నారు. భాకారాంపురంలోని ఎంపీపీఎస్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బూత్‌లో వైయస్‌ షర్మిల, వైయస్‌ భారతీరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మళ్లీ రాజన్న రాజ్యం రాబోతుంది..

ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం వైయస్‌ షర్మిల మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత పోరాడారో ప్రజలంతా చూశారు. చంద్రబాబుపాలనతో ప్రజలంతా విసిగిపోయారు. వైయస్‌ జగన్‌ ప్రతి జిల్లాలో యువభేరీలు పెట్టి యువతను చైతన్యం చేశారు. ఆ ఉద్యమం ఇంకా బతికి ఉందంటే దానికి కారణం వైయస్‌ జగన్‌ అని ప్రజలు నమ్ముతున్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రాబోతుంది. 

Back to Top