మాట తప్పని నైజం...వైయస్‌ఆర్‌ కుటుంబానిది.

బీసీల దశదిశ మార్చేలా వైయస్‌ఆర్‌సీపీ డిక్లరేషన్‌ 

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

పశ్చిమగోదావరి:చంద్రబాబు అధికారంలోకి వచ్చే ముందు బీసీ డిక్లరేషన్‌ ఇచ్చి..ఒక హామీ కూడా నెరవేర్చలేదని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ఏలూరులో జరుగుతున్న  వైయస్‌ఆర్‌సీపీ బీసీ గర్జనలో ఆయన ప్రసంగించారు. వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చే బీసీ డిక్లరేషన్‌..చంద్రబాబు మాదిరి కాదని..  ఇచ్చిన ప్రతి మాట నిలుపుకోవాలనే సంకల్పం ఆయనదని తెలిపారు. ఎన్నికల కోసం,ఓట్లు కోసం ఇచ్చే మాట కాదని స్పష్టం చేశారు.బీసీలు ప్రతి ఒక్కరికి మేలు జరగాలనే లక్ష్యంతో వైయస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించబోతున్నారని తెలిపారు.ఇచ్చిన ప్రతి మాట అమలు చేసే తత్వం డా.వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబానికి ఉందన్నారు.వైయస్‌ఆర్‌.. మాట ఇచ్చినవి, ఇవ్వనవి అన్ని అమలు చేశారని గుర్తుచేశారు.బీసీ గర్జన ప్రాంగణాన్ని జ్యోతిరావు ఫూలే ప్రాంగణంగా నామకరణం చేసుకున్నామని..వైయస్‌ఆర్‌ ఆయన మాటలను స్ఫూర్తిగా తీసుకున్నారన్నారు. విద్య లేనిదే విజ్ఞానం లేదు..విజ్ఞానం లేనిదే నైతికత లేదు..నైతికత లేనిదే ఐక్యత లేదు..ఐక్యత లేనిదే శక్తి లేదు.. శక్తి లేక అణగారిన వర్గాలు అణిచి వేయబడుతున్నాయని అన్న ఫూలే మాటలను వైయస్‌ఆర్‌ స్ఫూర్తిగా తీసుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.బీసీ దశదిశ మార్చేలా వైయస్‌ఆర్‌సీపీ డిక్లరేషన్‌ ఉంటుందని తెలిపారు.

Back to Top