క్రెడిట్ చోరీ మానుకో బాబూ

 అంబేద్కర్ కళావేదికకు జగన్ హయాంలోనే రూపం వచ్చింది

వైయ‌స్ఆర్‌సీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే  మల్లాది విష్ణు 

విజయవాడ: అంబేద్కర్ కళావేదికను మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కళావేదిక వద్ద సెల్ఫీ తీసుకుని మీడియాతో మాట్లాడిన ఆయన.. అంబేద్కర్ విగ్రహం పేరుతో మాటలు చెప్పి చేతులు దులిపేసుకున్నది చంద్రబాబేనని విమర్శించారు.

వైయ‌స్ జ‌గ‌న్ బెజవాడ నడిబొడ్డున రూ.400 కోట్లతో 206 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహంతో పాటు స్మృతివనం, డిజిటల్ మ్యూజియం, అతిపెద్ద మల్టీపర్పస్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. అంబేద్కర్ స్మృతివనం డిజైన్లను స్వయంగా జగన్ పరిశీలించారు” అని తెలిపారు. కన్వెన్షన్ సెంటర్‌ను చూసి చంద్రబాబే గతంలో “చాలా బాగా వచ్చింది” అని మెచ్చుకున్నారని గుర్తుచేశారు. “జగన్ హయాంలో ప్రభుత్వం ఇమేజ్ పెంచే ఎన్నో నిర్మాణాలు జరిగాయి. అంబేద్కర్ కళావేదిక కన్వెన్షన్ సెంటర్ జగన్ సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేసి క్రెడిట్ చోరీ చేస్తున్నారు” అని మండిపడ్డారు. రుషికొండ బిల్డింగ్ నిర్మాణాలను పరిశీలించినప్పుడు కూడా అద్భుతంగా ఉన్నాయని చంద్రబాబే మెచ్చుకున్నారని, ఇప్పుడు అదే నోటితో వైయ‌స్ఆర్‌సీపీని “గొడ్డలి పార్టీ” అని విమర్శించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.

“జగన్ కంటే ఎక్కువ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి జగన్ కంటే ఎక్కువగా ఏం చేశారో మహానాడులో ప్రకటించాలి. జగన్ అప్పులు చేశాడని విమర్శించిన మీరు రెండేళ్లలోనే రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేశారు” అని విమర్శించారు. జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించిన మల్లాది విష్ణు.. “మీ రెండేళ్ల పాలన గురించి ప్రజల ముందుకు వచ్చి చెప్పే ధైర్యం మీకు లేదు” అన్నారు. వంగ‌వీటి మోహ‌న రంగా హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. “రంగా హత్య తర్వాత ఎందుకు మీ మంత్రులు రాజీనామా చేశారు? ఎందుకు ఎన్టీఆర్ రంగా ఇంటి ముందు నిలబడ్డారు?” అని ప్రశ్నించారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చేసిన పనులపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు.
 

Back to Top