తాడేపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వాటిని పూర్తిగా విస్మరించిందని వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. “బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ” అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైందన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ కీలక నేతల సమావేశంలో మాట్లాడిన ఆయన.. “జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తాం, ఇంకా మెరుగైన పాలన అందిస్తాం” అంటూ చంద్రబాబు ప్రజలను నమ్మించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, ఇప్పటికే మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని గుర్తుచేసిన వైయస్ జగన్.. ఎన్నికల సమయంలో ఊదరగొట్టిన సూపర్-6, సూపర్-7 హామీల జాడ ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం.. ప్రశ్నించే వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోందని విమర్శించారు. ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోంది. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చేతకాక.. విమర్శలపై అసహనం చూపిస్తున్నారు” అని వైయస్ జగన్ అన్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏమన్నారంటే.. కూటమి ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సమయంలో నిరసన కార్యక్రమాలు ఏరకంగా ప్లాన్ చేయాలి అన్న విషయాల మీద రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సన్నద్ధంగా ఎలా ఉంచాలి అన్నదాని మీద, మూడోది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సర్.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్ట్రోరల్ రోల్స్. దీనికి సంబంధించి సూచనలు, జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని అన్న వాటి మీద, ఈ మూడు అంశాల మీద ఈరోజు మీ అందరితో కూడా సుదీర్ఘంగా కొన్ని జాగ్రత్తలు, కొన్ని సూచనలు, కొన్ని సలహాలు ఇవన్నీ కూడా మీ అందరితో కలిపి షేర్ చేసుకునేదాని కోసం ఈరోజు మనమంతా ఇక్కడ కలవడం జరిగింది. ఇందులో మొట్టమొదటిది రెండేళ్ల చంద్రబాబుగారి పాలన గురించి బహుశా నాకన్నా కూడా చక్కగా ఏ కార్యకర్తకు మైక్ ఇచ్చినా కూడా చక్కగా చెబుతాడు చంద్రబాబు నాయుడు పాలన ఈ రెండేళ్లలో ఎలా ఉంది అని చూసిన తర్వాత. చంద్రబాబు నాయుడు పాలనలో బాబు ష్యూరిటీ, మోసం గ్యారెంటీ అని మాత్రం రుజువైంది ఈ రెండేళ్ల చంద్రబాబు పాలన చూస్తే అని ప్రతి కార్యకర్తా కూడా ప్రతి ఇంట్లో ఉన్న వ్యక్తి, ప్రజలు అందరూ కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. ఈరోజు చంద్రబాబు నాయుడుగారి 2 సంవత్సరాల మోసపూరిత పాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు, విధ్వంసానికి, అరాచకానికి, అబద్ధాలకు ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కు, ఆయన దోపిడీ, అవినీతి పాలిటిక్స్ కు ఈ రెండేళ్ల చంద్రబాబు నాయుడు పరిపాలన.. ఇంతకు ముందు ఎన్నికలప్పుడు కథ కూడా చెప్పా ఒకట. ఒక ముసలి పులి, బంగారు కడియం కథ. ఎన్నికలప్పుడు కూడా నేను బాగాచెప్పేవాడిని చంద్రబాబునాయుడుకు ఓటు వేయడం అంటే ఇదే అని. కరెక్టుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు అదే రుజువు అవుతున్న పరిస్థితులు కూడా మన కళ్ల ఎదుటే మనం చూశాం. ఆరోజుల్లో చంద్రబాబు నోట్లో నుంచి వచ్చిన మాటలన్నీ కూడా జగన్ ఇచ్చేవే కాదు, అంతకన్నా ఎక్కువ ఇస్తాను అని చెప్పి, ఆరోజు చంద్రబాబు నాయుడు పులి, బంగారు కడియం కథ మాదిరిగానే ప్రజలందరినీ నమ్మించిన పరిస్థితి. తీరా ఓటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని పులి తిన్నట్టుగానే తినేస్తున్నాడు. ఆ కథలో ముసలి పులి ఏ మాదిరిగా చేస్తోందో చంద్రబాబు నాయుడును చూసినా ఈరోజు అదే కనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు సూపర్ సిక్స్ అన్నాడు, సూపర్ సెవెన్ అన్నాడు, మేనిఫెస్టో కాపీ అన్నాడు, 143 హామీలు ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి చివరికి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితులు ఈరోజు మనమంతా చూస్తున్నాం. రెండేళ్లు అయిపోయింది, మూడో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఈరోజుటుకి కూడా సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లలో భాగంగా ఆడబిడ్డ నిధి ఏమైంది? 18 ఏళ్ల వయసు నిండిన ప్రతి ఒక్కచెల్లెమ్మకూ ప్రతి నెలా రూ.1500 చొప్పున సంవత్సరానికి రూ.18 వేలు ఇస్తా అన్నావు కదా, రెండేళ్లుఅయిపోయింది, మూడో సంవత్సరం బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా అని అడిగితే మాట రాదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లో భాగంగా నిరుద్యోగ భృతి అని, చదువుకున్న ప్రతి పిల్లాడికీ కూడా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. సంవత్సరానికి రూ.36 వేలు, రెండేళ్లకు రూ.72 వేలు ఇప్పటికే బాకీ పడ్డావు. మూడో సంవత్సరంలో కూడా బడ్జెట్లో కూడా పెట్టలేదు కదా అంటే దాని మీద మాట ఉండదు. 50 ఏళ్లకే పెన్షన్ అన్నావు, 50 ఏళ్లు నిండిన ప్రతి అక్కచెల్లెమ్మకూ సంవత్సరానికి రూ.48 వేలు బాకీ, రెండేళ్లలో రూ.96 వేలు బాకీ. మూడో సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి అలాట్మెంట్లు లేవు కదా అంటే దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడా కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతోంది. టపా అని ఎక్కడన్నా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని నిద్రలేపి మావిగన్ అని చెవిలో అన్నారంటే మాత్రం అక్కడే పడిపోయినా పడిపోతాడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ఇవన్నీ చూస్తున్నాం. 143 హామీల్లో మనందరికీ కూడా ప్రధానంగా కనిపించేవి.. పెట్రోలు, డీజిల్ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. పెట్రోలు, డీజిల్ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈరోజు పెట్రోలు రూ.117 దాటింది. డీజిల్ చూస్తే రూ.105 దాటింది. ఈ పెట్రోలు, డీజిల్ ను చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాడు. అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తానని, చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయిపోయింది. మూడో సంవత్సరం కూడా మొదలైంది. ఈరోజు పెట్రోలు, డీజిల్ ను విపరీతంగా బాదుడే బాదుడు కనిపిస్తోంది. ఇప్పటికే పెట్రోలు రూ.117 దాటింది, డీజిల్ రూ.105 దాటింది. ఇందులో స్టేట్ గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్సుల రూపేణా వచ్చే సొమ్మే పెట్రోలు మీద రూ.31.62, డీజిల్ మీద రూ.23.46. సెంట్రల్ గవర్నమెంట్ కు వచ్చే ఆదాయం పెట్రోలు మీద రూ.11.90 అయితే, డీజిల్ మీద రూ.7.80. మరి ఈరోజు రూ.117.50 పెట్రోలు కనిపిస్తోంది. డీజిల్ రూ.105.50. ఇంత దారుణమైన బాదుడు కనిపిస్తున్నప్పుడు నీ పెట్రోలు మీద ట్యాక్సులు, డీజిల్ మీద నీకు వచ్చే ట్యాక్సులు ఎందుకు తగ్గించడం లేదయ్యా, ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వే కదా ఈ మాటలన్నీ రాశావు కదా అని అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడుకు బీపీ పెరుగుతుంది. ఎన్నికల హామీల్లో ఇంకా చాలా ఉన్నాయి. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పచ్చి మోసాలుగానే కనిపిస్తున్నాయి. సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే, మరోవైపున సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు అన్నీ చేసేశాం అని ఏకంగా అడ్వర్ట్టైజ్ మెంట్లు ఇచ్చుకుంటున్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడూ ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోజ్ చేసి, పేపర్లో అడ్వర్టైజ్ మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకునిపోయేటోడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడూ ఉండడేమో అబద్ధాలకు.. ఒక్క చంద్రబాబు నాయుడు గారు తప్ప. ఇదే పెద్దమనిషి చంద్రబాబు నాయుడు గారు తాను పలాని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఆయన నోట్లో నుంచి ఏవీ కూడా ప్రజలకు ఈ రెండు సంవత్సరాల్లో పలాని మంచి నేను చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రెండేళ్లలో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి ఆయన డైవర్షన్ పాలిటిక్స్ లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి, ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ లోకి మభ్యపెట్టాలన్న దిక్కుమాలిన ఆలోచనతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్ గా గొడ్డళ్లు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనమంతా చూస్తూనే ఉన్నాం. నిజంగా ప్రజలందరూ పిచ్చోళ్లు అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్లు. ప్రజలు చాలా చైతన్య వంతులు. నిజంగా రాష్ట్రంలో ఏ ప్రాంతమైనా బాగుపడిందన్నా, రాష్ట్రంలో నిజంగా ఎక్కడైనా అభివృద్ధి జరిగిందన్నా, నిజంగా రాష్ట్రంలో ఎక్కడైనా పేదవాడికి నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లాయి అన్నా, ఒక రైతు బాగుపడ్డాడు అన్నా, ఒక అక్కచెల్లెమ్మ బాగుపడిందన్నా, ఒక పిల్లాడు చదువుల విషయంలో బాగుపడినాడు అన్నా.. ఇవన్నీ ఎక్కడైనా జరిగాయా అంటే ఒక్క నాన్నగారి పాలనలోనే జరిగాయి. దాని తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మీ జగనన్న పాలనలోనే జరిగాయి అని గర్వంగా చెప్పగలుగుతాను. నిజంగా మంచి చేశాము అని చెప్పి కాలర్ ఎగరేసుకుని, మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నాం అని గర్వంగా ప్రతి ఇంటికీ వెళ్లగలిగిన పరిస్థితి ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని కూడా గర్వంగా చెప్పగలుగుతాం. ఈరోజు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అరాచకాలు, ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు నాయుడు గారి రెండు సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ప్రజలను జాగృతి పరిచేందుకు ఒక బుక్ లెట్ ను కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇది చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకు రెండేళ్లు. అని చంద్రబాబు నాయుడుగారి మీద బుక్ లెట్. ఇందులో ఆయన సూపర్ సిక్సులు, సూపర్ సెవెన్లు ఏరకంగా ఆయన మోసం చేశాడు దగ్గర నుంచి ఏరకంగా విద్యాదీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలతో ఎలా పిల్లలను రోడ్ల మీదకు తీసుకొచ్చినాడు అన్న పరిస్థితి నుంచి ఆరోగ్యశ్రీ పరిస్థితి, విద్య, వైద్యం, వ్యవసాయం ఏరకంగా కుప్పకూలిపోయింది, అక్కచెల్లెమ్మల జీవితాలు ఎలా చీకటిమయం అయిపోయాయి ఇటువంటి అన్ని విషయాలతో పాటు ఆయన దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అవినీతి అన్నీ కూడా ఈ పుస్తకంలో క్లుప్తంగా ఏ ఒక్కరికైనా అర్థమయ్యే భాషలో ఈ బుక్ లెట్ రూపొందించడం జరిగింది. ఈ బుక్కు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. క్యూఆర్ కోడ్, డిజిటల్ కాపీలు ప్రతి కార్యకర్తకూ కూడా చేరేలా మన పార్టీ వెబ్ సైట్లో కూడా ఈ బుక్కు వివరాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాం. వీటికి సంబంధించి క్షుణ్నంగా కూడా మనం చదువుకోవడమే కాకుండా, మన పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ రెండేళ్ల పాలన ప్రతి అంశం మీద అవగాహన ఉండేలా ఈ పుస్తకాన్ని రూపకల్పన చేసి వారికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇది వాళ్లందరికీ అందుబాటులోకి వెళ్లేలా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజలకు చంద్రబాబు పొడిచిన వెన్నుపోట్లను వివరిస్తూ మొదటి ఏడాది ఏరకంగా అయితే మనం ర్యాలీలు నిర్వహించామో బాగా జరిగింది అప్పట్లో కార్యక్రమం. అంతకన్నా కూడా రెండో ఏడాది చంద్రబాబు నాయుడు గారి పాలన మీద నిరసన తెలుపుతూ ఇంకా గొప్పగా ర్యాలీలు జరగాలి. ఈ కార్యక్రమాలు అన్నింటికీ కూడా జూన్ 4 నుంచి 12 వరకు వెన్నుపోటుకు రెండేళ్లు.. కార్యక్రమం అనేది పార్టీ తరఫున చేపడుతున్నాం. జూన్ 4 నుంచి 12 వరకు జరగబోయే ఈ కార్యక్రమాలు.. ఒకవైపున ఎస్ఐఆర్ కారణంగా, కమిటీల వెరిఫికేషన్ మనకు గ్రామ స్థాయిలో కమిటీల వెరిఫికేషన్ కారణంగానూ, ఎండల తీవ్రతను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్ రూపొందించడం జరిగింది. జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రతి మండలంలోనూ మీమీ నియోజకవర్గాల్లో జూన్ 4న ఈ కార్యక్రమం చేపట్టండి. చంద్రబాబునాయుడుగారికి సంబంధించి ఆయన మేనిఫెస్టో అంటే ఈనాడులో ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన అడ్వర్టైజ్ మెంట్ కాపీ, బాండ్లు ఏదైతే ఇచ్చారో, పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు ఫొటోలతో సంతకాలు చెప్పి బాండ్లు ఏదైతే ఇచ్చారో, ఆ బాండ్ల కాపీలు. ఇవి నెట్లో అందుబాటులోనే మన దగ్గరా ఉన్నాయి. మీరు కూడా మీమీ నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకూ కూడా ఈ విషయాలన్నీ చెప్పి దీంట్లో కూడా.ఈ బుక్కులో కూడా పెట్టడం జరిగింది. ఈనాడులో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్లు, బాండ్లు. ఇవి ప్రతి మండల కేంద్రంలో కూడా 4వ తేదీన ఈ రెండూ చూపిస్తూ మండల కేంద్రాల్లో నాలుగు కూడళ్ల మధ్య నిప్పంటించి నిరసన తెలిపే కార్యక్రమం జూన్ 4న మండల కేంద్రాల్లో చేపించే కార్యక్రమం. ఇందులో ఏదో ఒక మండలంలో నియోజకవర్గ ఇన్ చార్జి పాలు పంచుకోవాలి. మిగిలిన మండలాల్లో కార్యకర్తలు పాలుపంచుకునే కార్యక్రమం జరిగేలా ప్రణాళిక వేశాం అని వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో కళ్లెదుటే అది కనిపించింది కుప్పంలో మన కళ్ల ఎదుట కనిపిస్తున్న హిస్టరీ అండ్ మిస్టరీ.. రెండూ కూడా ఇక్కడే కనిపిస్తాయి. వీటికి సంబంధించి ఇన్నిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకు చెబుతున్నానంటే..ప్రతి ఊరిలో మన ఓటర్లు అనుకునేవాళ్లవి కేవలం 50 ఓట్లు తీసేస్తే చాలు.. నియోజకవర్గం మొత్తంలో మనవి 50 వేల ఓట్లు డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఊరిలో కూడా ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడానికి మీ అందరికి కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కొంచెం బోరింగ్ టాపిక్ మాదిరిగా అనిపించినప్పటికీ కూడా 20 నిమిషాలు కన్నబాబు అన్న మీ అందరికీ ఓరియంటేషన్ క్లాస్ ఇస్తాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి సూచనలమీద మనం ఎక్కువ ధ్యాస పెట్టాలి అనేది వివరిస్తాడు. మనమంచి కోసమే కన్నబాబు క్లాస్ చెబుతారు.. ఆ జాగ్రత్తలు, సూచనలు మనం పాటిస్తే.. నియోజకవర్గాల్లో అవి ఎంతో ఉపయోగపడతాయి. మన ఓట్లను ఎవరూ తీసేయకుండా.. మనవాళ్ల ఓట్లను మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి చాలా ఉపయోగపడతాయి. అవి చాలా అవసరమని అందరం భావించి.. ఈ మేరకు ఎక్సర్ సైజ్ చేసి మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అందరూ కన్నబాబు చెప్పే సూచనలను శ్రద్ధగా వినాలని కోరుతున్నాను.