రక్తదానంలో వైయ‌స్ఆర్ సీపీ వ‌ర‌ల్డ్ రికార్డ్‌

జననేత పుట్టిన రోజు సందర్భంగా 34,723 యూనిట్ల రక్తదానం

ప్ర‌పంచంలోనే అతిపెద్ద బ్ల‌డ్ డొనేష‌న్ క్యాంపుగా పేర్కొన్న వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధులు

రక్తదానం చేసి పార్టీ అధినేతపై అభిమానాన్ని చాటిన నాయకులు, కార్యకర్తలు

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైయస్‌ఆర్‌ సీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర క్యాడర్‌ మొదలు.. గ్రామ స్థాయి కమిటీల వరకు 175 నియోజకవర్గాల్లో నిర్వహించిన రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పార్టీ శ్రేణులు చేపట్టిన రక్తదానం 34,723 యూనిట్లను దాటి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును బద్ధలు కొట్టింది. గతంలో రక్తదానంలో 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్‌ రికార్డ్‌ను తుడిచిపెట్టింది. ప్రస్తుత ఈ రికార్డ్‌ను వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంటర్నేషనల్‌ నమోదు చేసుకుంది. ప్ర‌పంచం మొత్తంలో అతిపెద్ద బ్ల‌డ్ డొనేష‌న్ క్యాంపుగా వండ‌ర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేసి జననేత వైయస్‌ జగన్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. 

Back to Top