నేడు భీమిలిలో వైయస్‌ఆర్‌ సీపీ ‘సిద్ధం’ సభ

ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్న సీఎం వైయస్‌ జగన్‌

‘సిద్ధం’ సభకు భారీగా తరలిరానున్న వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులు

తాడేపల్లి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. భీమిలి సంగివలసలో నేడు వైయస్‌ఆర్‌ సీపీ ‘సిద్ధం’ భారీ సభను నిర్వ‌హించ‌నున్నారు. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరై ఉత్తరాంధ్ర వైయస్‌ఆర్‌ సీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున సభకు తరలిరానున్నారు. 

వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరి 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి భీమిలిలోని సంగివలసలో ఏర్పాటు చేసిన వైయస్‌ఆర్‌సీపీ ‘సిద్ధం’ సభాప్రాంగణానికి చేరుకుంటారు. ఎన్నికల శంఖారావాన్ని పూరించి, ఉత్తరాంధ్ర వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. 175కు 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపే లక్ష్యంగా, టీడీపీ–జనసేన కుట్రలను చిత్తు చేసేలా పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు. రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలతో నాలుగు భారీ సభలు ఏర్పాటు చేశారు. 

Back to Top