ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ద్వారా ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం

మీడియా స‌మావేశంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య,  పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌, ఎన్‌.రెడ్డప్ప 

 హోదా, విశాఖ రైల్వే జోన్‌తో పాటు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తాం

 ప్రత్యేక హోదా అన్నది క్లోజ్‌డ్‌ చాఫ్టర్‌ కాదు

 పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హోదా హామీని నెరవేర్చాలి

తాడేప‌ల్లి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి     ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంటులో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశ పెడతామని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తలారి రంగయ్య,  పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌,  ఎన్‌.రెడ్డప్ప తెలిపారు. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం( క్లోజ్డ్ చాప్టర్) కాదని, పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అని ఎంపీలు గుర్తు చేశారు. విభజన హామీలు సాధించుకోవడం కోసం పార్లమెంటులో గళమెత్తుతామని తెలిపారు. న్యూఢిల్లీలో వైయ‌స్ఆర్‌సీపీ  ఎంపీలు తలారి రంగయ్య,  పిల్లి సుబాష్‌ చంద్రబోస్‌,  ఎన్‌.రెడ్డప్ప లు మీడియాతో మాట్లాడారు.

తలారి రంగయ్య, ఎంపీ, అనంతపురం

-బీజేపీ ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రత్యేక హోదా అనేది క్లోజ్‌డ్‌ చాఫ్టర్‌ కాదు. ఎట్టిపరిస్థితుల్లోనూ అది క్లోజ్‌డ్‌ చాప్టర్‌ కాదు.. వాళ్లు ఎన్నిసార్లు హోదా ఇవ్వలేము చెప్పినా మేం అన్నిసార్లు ఇవ్వమని అడుగుతూనే ఉంటాం. విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అంశాలపై కూడా ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతాం. అయితే ఇవాళ దానిపై చర్చ ఉన్నా సభ వాయిదా పడటంతో కుదరలేదు. అవకాశం రాగానే మిగతా పార్టీల మద్దుతు కూడగట్టుకుని ఓటింగ్‌ కి వచ్చేలా కృషి చేస్తున్నాం.
-పవిత్రమైన పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హోదా హామీని నెరవేర్చాలి
-ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజ్యసభలో ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తే, అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా దాన్ని సమర్ధించింది.
-విభజన చట్టం ప్రకారం ఇంకా రాష్ట్రానికి రావాల్సినవి చాలా ఉన్నాయి
-వాటిని సాధించడం కోసం మేం మా పార్టీ తరఫున పోరాడుతూనే ఉంటాం
-కానీ చాలా కాలంగా వాటిలోని అంశాలు అమలు కావడం లేదు
-అనంతపురం సెంట్రల్‌ యూనివర్సిటీకి సరిపడా నిధులు ఇవ్వడం లేదు
-రాజస్థాన్, గుజరాత్‌కు సమంగా ఏపీలోనూ జనాభా ఉన్నారు. కానీ అక్కడి మెడికల్‌ కాలేజీలకు లభిస్తున్న అనుమతులతో పోలిస్తే..  ఇక్కడ అనుమతులు రాలేదు
-ఈ ఏడాది బడ్జెట్‌లోనూ మెడికల్‌ కళాశాలల ప్రస్తావన తక్కువగా ఉంది
-గుజరాత్, రాజస్థాన్‌ తరహాలో ఏపీకి మెడికల్‌ కాలేజీలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం
-క్యాపిటల్‌ లేకుండా ఆంధ్రప్రదేశ్‌కి తలను తీసేశారు...మద్రాసు రాష్ట్రం నుంచీ ఇలా జరుగుతూనే వస్తోంది
-తీసేసిన తలకు మళ్లీ జీవం పోయాల్సిన బాధ్యత కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు ఉంది
-తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇవ్వం ఇవ్వం అని చెప్పి ఇచ్చారు కదా..
-అలానే మేం హోదా ఇచ్చే వరకూ పోరాడుతాం-ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జరిగిన తీవ్ర నష్టాన్ని సరిదిద్దాలని మేం కోరుతున్నాం
-వీటన్నిటి గురించి మాట్లాడేందుకే మేం ప్రైవేటు మెంబర్‌ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతాం.
-నదుల అనుసంధానం జరిగితే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
-మన వద్ద జలవనరులు అధికంగా ఉన్నాయి..వాటిని సాగు భూములకు చేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది
-రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది
-వీటన్నిటిపై పోరాడేందుకు రాబోయే రోజుల్లో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ద్వారా వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం

పిల్లి సుబాష్‌ చంద్రబోస్, రాజ్యసభ సభ్యుడుః
-ఏపీ విభజన సందర్భంగా.. అప్పట్లో కేంద్రం ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చని పరిస్థితి ఉంది
-బడ్జెట్‌లో మా లాంటి చిన్న రాష్ట్రాలకు చేయూత ఇస్తారని ఆశించాం
-ప్రత్యేక హోదా కోరిక నెరవేర్చకపోవడం, విశాఖ రైల్వే జోన్‌ ఇవ్వకపోవడం వంటివి బాధపెట్టాయి
-దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్‌లకు కలిపి రూ.6700 కోట్లు ఇచ్చారు
-అమరావతిలోని ఎయిమ్స్‌ కొత్తగా పెట్టిన ఆస్పత్రి.. వచ్చే ఆ నిధులు ఎందుకూ సరిపోవు..మరిన్ని నిధులు ఇస్తేగానీ అక్కడ అభివృద్ధి జరగదు
-అరకొర నిధులతో ఇంకా కొనసాగిస్తున్నారంటే తీవ్రమైన అన్యాయాన్ని రాష్ట్రానికి చేసినట్లే
-పవిత్ర దేవాలయం లాంటి పార్లమెంటులో ఇచ్చిన హామీని అమలు చేయడంలో విఫలమైతే ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగే ప్రమాదం ఉందని ప్రధాని గమనించాలి
-ఒక ప్రభుత్వం పార్లమెంటులో ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉంటుంది
-ఇప్పటికే రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతోంది
-చంద్రబాబు ఇచ్చిన 600కు పైగా హామీల్లో 10 శాతం కూడా అమలు చేయలేదు...ఇలాంటి రాజకీయ పార్టీలపై ప్రజల్లో ఎందుకు విశ్వాసం ఉంటుంది..?
-ఒక హామీ ఇచ్చామంటే ఖచ్చితంగా అమలు చేయాలని మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్‌ చెప్పారు-మొదటి రోజు నుంచే వాటి అమలుకు ఆయన కృషి చేశారు
-అలానే ప్రత్యేక హోదాపై ఎవరు హమీ ఇచ్చారు అనేది పక్కన పెట్టి,  కేంద్ర ప్రభుత్వంగా హామీ ఇచ్చిందని గుర్తించాలి
-దాన్ని అమలు చేయాల్సిన కనీస ధర్మం ఈ ప్రభుత్వం మీద కూడా ఉందని భావిస్తున్నాం
-అలానే, రెవిన్యూ లోటు, వెనుకబడిన ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలకు నిధులు ఇతోధికంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది
-నదుల అనుసంధానం అన్నారే కానీ రాష్ట్రానికి నిధుల కేటాయింపులు లేవు
-దీర్ఘకాలిక ఫలితాలనిచ్చే వాటిపై కూడా నిధులు కేటాయించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి
-విభజన తర్వాత ఏపీ ప్రజల మనసులు గాయపడి ఉన్నాయి..దానికి విభజన చట్టం వల్ల కొంత ఊరట వచ్చిందని అనుకున్నాం
-కానీ దానిలోని అంశాలు అమలు కాకపోతే ఫలితం ఏముంది...ప్రధాన మంత్రి దీనిపై దృష్టి పెట్టాలి
-ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, నదుల అనుసంధానంలో ఏపీకి నిధులు కేటాయింపులు ప్రధానంగా అడుగుతున్నాం

ఎన్‌.రెడ్డప్ప, ఎంపీః
-బడ్జెట్‌లో ఏపీకి మొండి చేయి చూపినందున ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు
-కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది కానీ దేశవ్యాప్తంగా తనకు మనుగడ లేకుండా చేసుకుంది
-అనేక సంక్షేమ పథకాలతో శ్రీ జగన్‌ గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు
-ప్రత్యేక హోదాపై గత నాలుగేళ్లుగా మేం పార్లమెంటులో విన్నపాలు చేస్తూనే ఉన్నాం
-మా ముఖ్యమంత్రి గారు సుమారు 20 సార్లు ఢిల్లీ వచ్చి హోదా ఇవ్వమని కేంద్రాన్ని కోరారు
-ఇంతకాలం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పోరాటాలు చేస్తూనే ఉన్నాం...స్పందన లేదు కాబట్టే ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు పెడుతున్నాం
-ఖచ్చితంగా పార్లమెంటులో మా గళాన్ని వినిపించి హోదాను సాధించుకుంటాం
-రాష్ట్రాన్ని విడగొట్టింది చంద్రబాబే...ప్రత్యేక హోదా, నిధులు రానివ్వకుండా చేసిన ఘనుడు చంద్రబాబు-మళ్లీ ఆయనే మమ్మల్ని తప్పు పడుతున్నారు
-ఎంతో అనుభవం ఉందన్న చంద్రబాబు కనీసం కుప్పానికి మంచినీళ్లు కూడా తీసుకురాలేకపోయాడు
-కుప్పంలో లోకేశ్‌కు కనీసం వెయ్యి మంది కూడా రావడం లేదు..పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లయ్యింది లోకేష్ పాదయాత్ర. 
-వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ప్రభంజనం ఉంటుంది

Back to Top