కుప్పంలోనే చంద్రబాబుకు రాజకీయ సమాధి 

బాబు చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రెడ్డప్ప

ఢిల్లీ: చంద్రబాబు ప్రజల విశ్వాసం కోల్పోయారని, సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఆయనకు రాజకీయ సమాధి కట్టారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఢిల్లీలో మంత్రి రెడ్డప్ప మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును కుప్పం ప్రజలు కూడా ఛీ కొట్టారన్నారు. కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు చూశాడని, ఆయన చేసిన తప్పులకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. చంద్రబాబు ఇకనైనా తన తప్పులు తెలుసుకోవాలని, కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలని సూచించారు. ఓటమి భయంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బహిష్కరణ నాటకం మొదలుపెట్టారని, బహిష్కరణ చేసిన వాళ్లు బీఫామ్‌తో నామినేషన్‌ ఎలా వేశారని టీడీపీని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైయస్‌ఆర్‌ సీపీదే విజయమని, ప్రజల హృదయాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నిలిచిపోయారన్నారు. 

 

Back to Top