చిత్తూరు డెయిరీని సర్వనాశనం చేసిన నీచుడు చంద్రబాబు

చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టుపట్టించిన పరమనీచుడు చంద్రబాబు

ఇచ్చిన మాటకు కట్టుబడి డెయిరీని పునఃప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు

చిత్తూరు: పాదయాత్రలో ఇచ్చిన మాటను నిజం చేస్తూ మూతబడిన చిత్తూరు డెయిరీని అమూల్‌ సహకారంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పునఃప్రారంభించారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. దేశంలోనే పేరుగాంచిన చిత్తూరు డెయిరీని తన సొంత లాభం కోసం మూసివేసిన పరమ నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. అప్పటి డెయిరీ చైర్మన్, చంద్రబాబు బినామీ దొరబాబుతో చిత్తూరు డెయిరీని నష్టాల బాటలో నడిపించేలా చేసి.. డెయిరీని మూయించిన మూర్ఖుడు, జిల్లాకు పట్టిన శని, చరిత్ర హీనుడు చంద్రబాబు అని ఎమ్మెల్యే శ్రీనివాసులు ధ్వజమెత్తారు. చిత్తూరు డెయిరీ పునఃప్రారంభం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడారు.

చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టుపట్టించిన పరమనీచుడిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోయాడు. ∙రాయలసీమ రత్నం, పులివెందుల పులిబిడ్డ, డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు సీఎం వైయస్‌ జగన్‌ రైతుల పక్షాన బాసటగా నిలిచారు. నాడు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిజం చేస్తూ అమూల్‌ డెయిరీ సహకారంతో చిత్తూరు డెయిరీని ప్రారంభించి పాడి రైతుల బాంధవుడిగా నిలిచారు. 

అదే విధంగా ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రపంచ ప్రఖ్యాత గాంచిన సీఎంసీని నాడు మహానేత వైయస్‌ఆర్‌ చీలాపల్లిలో స్థాపించారు. అదే బాటలో సీఎం వైయస్‌ జగన్‌ నాలుగు అడుగులు ముందుకేసి చీలాపల్లి సీఎంసీలో 300 పడకల ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి..

  • విజయ డెయిరీ ఎంప్లయీస్‌ జీతాలను పరిశీలించాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాను.
  • షుగర్‌ ఫ్యాక్టరీ స్థానంలో పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నెలకొల్పాలని కోరుతున్నాం.
  • చిత్తూరు కార్పొరేషన్‌లో 14 పంచాయతీలు విలీనమయ్యాయి. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరుతున్నాను. 
  • చిత్తూరులో కాపు భవనం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాను. 
  • చిత్తూరు, గుడిపాల మండలాలకు సంబంధించి 23 గ్రామాలకు మట్టిరోడ్లు ఉన్నాయి. ఆయా గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాను. 
  • సీఎంసీని ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుకుంటున్నాను. చిత్తూరు నియోజకవర్గానికి సహాయ, సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. 

 

Back to Top