ప్రజాక్షేత్రంలో చతికిలబడ్డ కూటమి ప్రభుత్వం

వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు ఆగ్రహం

ఎన్నికల హామీల అమలు చేయడంలో విఫలం 

కూటమి వైఫల్యాలను ప్రజలముందుంచిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ

ప్రజల దృష్టని మరల్చడానికే కూటమి కక్ష సాధింపు చర్యలు

లేని లిక్కర్ స్కాంతో ప్రజల దృష్టని మరల్చే ప్రయత్నం

కూటమికి వంత పాడుతున్న ఎల్లో మీడియా

ధ్వజమెత్తిన కే కే రాజు.

ఏడాది కూటమి పాలనలో ఏరులై పారుతున్న మద్యం

రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసిన 2-3 బెల్టుషాపులు

మీ పార్టీ ప్రతినిధుల ఆధ్వర్యంలో బహిరంగ వేలం

కాదనే ధైర్యం మీకుందా చంద్రబాబు

కూటమి ప్రభుత్వానికి కేకే రాజు సవాల్ 

మీ మద్యం పాలసీతో రాష్ట్రంలో పెరిగిన క్రైమ్ రేటు

ఆడపిల్లలు, మహిళల మీద వరుస అఘాయిత్యాలు

మీ తప్పులు కప్పి పుచ్చుకునేందుకు తెరపైకి లిక్కర్ స్కాం

మీ కేసులకు, అరెస్టులకు భయపడేది లేదు

ప్రజల తరపున మా పోరాటం ఆగదు

ప్రభుత్వాన్ని హెచ్చిరించిన కేకే రాజు 

విశాఖపట్నం: ప్రజలకిచ్చిన హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం.. దాన్నుంచి దృష్టి మరల్చేందుకు చేపడుతున్న కక్ష సాధింపులు చర్యలు తారాస్థాయికి చేరాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...  లిక్కర్ కేసులో తాజా పరిణామాలు, ఎల్లో మీడియాలో వస్తున్న కధనాలే దానికి నిదర్శనమని కేకే రాజు తేల్చి చెప్పారు. లేని మద్యం కేసుని సృష్టించి ఏదో రకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఇరుకున పెట్టి ఆనంద పడాలనే ఉద్దేశ్యంతో ఈ కేసుతో సంబంధం లేని అమాయకుల్ని కూడా ఇరికించి.. ఆ కుటుంబాల ఉసురుపోసుకునే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే...

హామీల అమల్లో చతికిలబడ్డ కూటమి ప్రభుత్వం:
 
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గడిచిన 13 నెలల కాలంలో అమలు చేయలేకపోయింది. సంపద సృష్టిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ పనిచేయలేక చతికిలబడ్డారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల దగ్గర నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రజా క్షేత్రంలో టీడీపీ నేతలు తిరిగే పరిస్థితి లేదు. కేవలం రాజకీయాలను పక్కదోవ పట్టించాలనే ఉద్దేశ్యంతో అధికారం చేపట్టనప్పటి నుంచి ప్రతి నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పదే పదే రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చారు. నాకేం చేయాలో అర్ధం కావడం లేదు. రాష్ట్రానికి ఏదైనా చేయాలనుకుంటే నాకు ఎవరూ అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. నన్ను ఎవరూ నమ్మడం లేదు అని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నాడు. అంటే ప్రజలకు అండగా నిలబడి భరోసా ఇవ్వాల్సిన వ్యక్తి... ఈ రాష్ట్రానికి అప్పులు ఇచ్చేందుకు నన్ను నమ్మడం లేదంటున్నారు. అంటే ఆయనే అభద్రతాభావంతో ఉన్నారు.

ప్రజల తరుపున ప్రశ్నిస్తున్నందుకే కేసులు:

కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రజలను మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలకు అండగా నిలబడుతూ ప్రజా క్షేత్రంలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ప్రజల తరపున వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలను చూసి ఓర్వలేకే రకరకాల స్కామ్ లను తెరపైకి తీసుకుని వచ్చి వాటిని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై రుద్దే కార్యక్రమం చేస్తోంది. లేని లిక్కర్ స్కామ్ ని తీసుకుని వచ్చి కొంతమందిని అరెస్టు చేసిన తర్వాత ఎల్లో మీడియాకు చెందిన పత్రికల్లో సిట్ అధికారులు అన్నీ వారికి చెప్పినట్లు రాస్తున్నారు. వాస్తవానికి ఏదైనా ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు కోర్టు అనుమతితో దానికి సంబంధించిన సమాచారం బయటపెడతారు. కానీ ఎల్లో మీడియా రూ.80 వేల కోట్ల నుంచి మొదలు పెట్టి రూ.30,20 వేల కోట్లు అంటూ ఇవాళ రూ.3 వేల కోట్లకు దిగారు. లిక్కర్ స్కాంకు సంబంధించి దర్యాప్తు అధికారులు పత్రికా ముఖంగా ఎక్కడా ప్రకటించలేదు. అదే విధంగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా అరెస్టు చేసిన వ్యక్తుల దగ్గర కానీ, దర్యాప్తు చేస్తున్న అధికారులకు కానీ ఏదైనా సాక్ష్యాధారాలు దొరికాయా.? మీరు రాస్తున్నట్టు కట్టలుగా, గుట్టలుగా దోచుకున్నారని చెబుతున్న నగదు పట్టుకున్న దాఖలాలు ఉన్నాయా? ఏమీ లేవు. ఉండవు కూడా. కేవలం డబుల్ ఇంజన్ సర్కారు పేరు చెప్పి, కూటమి పేరు చెప్పి అలవుకానీ హామీలు ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై దుష్ప్రచారం చేసారు.  రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు. అయినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓటు షేర్ వచ్చింది. ఎన్నికలు జరిగి 164 స్ధానాలు మేం గెల్చుకున్నా.. ఎన్నికలు జరిగిన మూడు నెలలకే ప్రజలు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెంట నడుస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిప్రజాక్షేత్రంలోకి ? ఎక్కడకి వెళ్లినా ఆయన వెంట వేలాదిగా తండోపతండోలుగా జనం వస్తున్నారు. కాబట్టి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశ్యంతో.. ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా సరే.. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెన్నంటి ఉన్న నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. తాము అనుకున్న స్కామ్ ల గురించి ముందుగా లీకులు ఇస్తున్నారు. కానీ ఇవాల వస్తున్న కథనాలు అన్నీ దర్యాపు సంస్థలు చేస్తున్న ట్రయల్స్ కాదు. కేవలం ఎల్లో మీడియా ట్రయిల్స్ మాత్రమే. ఏదో రకంగా ఒక అంశాన్ని తీసుకొచ్చి దాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగానే రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటైంది.

నాడు ఎన్టీఆర్ కు నేడు ప్రజలకు బాబు వెన్నుపోటు:

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని, తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న దగ్గర నుంచి ఇవాల్టి వరకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.
అమ్మఒడి విషయంలో మీరు చేస్తున్న చర్యలను గుర్తు చేస్తూ మేం వెన్నుపోటు దినం పేరుతో ప్రజాక్షేత్రంలో  మేం పోరాటం చేయబడ్డే మీరు అరకొరగానైనా విద్యార్ధులకు, తల్లులకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షం అంటేనే ప్రజా ప్రభుత్వం.
గతంలో 2014-19లో కూడా మీరు మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తామని, రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని, స్పెషల్ ప్యాకేజీ తెస్తామని ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత.. రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెందారు. అప్పుడు కూడా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన నిలబడి వారి కోసం పోరాటం చేశారు. మీ మెడలు వంచి వారికి కొద్దిగానైనా న్యాయం చేశారు. ఇవాళ కూడా మీరు ఎంత కుట్రలు, కుతంత్రాలు చేసినా.. ఎంత అణిచివేయాలని చూసినా .. రాజ్యాంగం ప్రకారం.. ప్రజలకు మీరిచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీల అమలు కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం పోరాటం చేస్తుంది. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడు కేసుల్లో బెయిల్ పై ఉన్నారు. వాటికి సంబంధించిన దర్యాప్తును పూర్తిగా నిర్వీర్యం చేసి... మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇలా దేని గురించి అడిగినా వారిపై ఏదో ఒక రకంగా తప్పడు కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారు. 2014-19 లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం షాపులకు సంబంధించి, బార్లుకు సంబంధించి పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. వేలాది కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయని ఇవాళ మీ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నవ్యక్తులే పెద్ద ఎత్తున గళమెత్తారు. 2019-24 వరకు పారదర్శకంగా కొత్త పాలసీని తీసుకువచ్చి తద్వారా దఫదఫాలుగా వినియోగం తగ్గించి.. మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేయాలని పారదర్శకంగా మద్యం పాలసీని తీసుకొచ్చాం. కేవలం మీ అహంకారంతో, మీ మీడియా ట్రయిల్స్ లో లిక్కర్ స్కాం ఉందని మీకు ఊహ వస్తే.. దాన్ని కుట్రతో, కక్షపూరితంగా నిజం చేయాలన్న ఉద్దేశ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి.
గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వైన్ షాపులు నడిచేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేశారు. ఇప్పటికే వైద్య, విద్యారంగాన్ని ప్రయివేటుకు ధారాదత్తం చేశారు. గతంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైద్య రంగాన్ని బలోపేతం చేసి పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు కట్టి పేదవాడు డాక్టర్ కావాలన్న కలను నిజం చేస్తే.. మీరు ఇవాళ వాటిని కూడా ప్రయివేటుకు ధారాదత్తం చేశారు. 

కీలక నేతలే లక్ష్యంగా కేసులు:

ఏ రాష్ట్రంలో నైనా మద్యం కొనుగోలుకు సంబంధించి.. డిస్టలరీలు, మార్కెటింగ్ కన్సెల్టెన్నీ ఇలా దపదఫాలుగా వాటి ధరలు నిర్ణయిస్తారు. ఇవాళ మీరు ఆరోపిస్తున్న లిక్కర్ స్కాంకు సంబంధించి తయారీ దారులు వచ్చి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఏవరైనా మీరు ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరఫరా చేస్తున్న లిక్కర్ వాల్యూంలకు సంబంధించి మాకు ఇంత కమిషన్ ఇవ్వండని అడిగినట్లు డిస్టలరీ యజమానులు కానీ, కన్సెల్టెంట్లు ఫిర్యాదు చేశారా.? లేదు అంటే కేవలం వైయ‌స్ఆర్‌సీపీని నిలువరించాలి. వైయ‌స్ఆర్‌సీపీ కార్యక్రమాలు నిర్వీర్యం చేయాలి. అలా చేయాలంటే వైయ‌స్ఆర్‌సీపీలో యాక్టివ్ గా ఉన్నవాళ్లను, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల పక్షాన చురుకుగా పోరాటం చేస్తారో వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే లేని లిక్కర్ స్కామ్ లను బయటకు తీసుకువచ్చారు.

కూటమి పాలనలో ఏరులై పారుతున్న మద్యం:

2019-24 వరకు స్కాం జరిగింది అంటున్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైన్ షాపులు, బార్లు పరిస్థితి చూస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, మహిళల మీద దాడులు, రౌడీ మూకల అల్లర్లుకు, ప్రమాదాలకు  కారణం మీరు విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్న మీ లిక్కర్ పాలసీయే కారణం. 
అందుకే రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది. బెల్టుషాపులుంటే తాట తీస్తామని గొప్పగా స్టేట్ మెంట్లు ఇచ్చారు.. కానీ ఇవాళ ప్రతి గ్రామ,గ్రామాన ఒక్కో పంచాయితీకి మూడు,నాలుగు బెల్టు షాపులున్న సంగతి మీకు తెలియదా చంద్రబాబునాయుడు గారూ.?
మీరు కాదని ఎవరైనా నిరూపించగలరా పంచాయితీల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మద్యం పాలసీలో  వైన్ షాపు నుంచి మద్యం తీసుకుని బెల్టుషాపు నిర్వహించడానికి వేలం వేస్తున్నారు. అధికారుల సమక్షంలో ఈ ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో బెల్టుషాపులు నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా.? మీరు అన్ని తప్పులు చేస్తూ.. పరిపాలనలో విఫలమయ్యారు. ప్రభుత్వంపైనా అధికారులపైనా మీ మంత్రులు, ఎమ్మెల్యేలపై  పట్టులేక మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. మీరు అధికారం లోకి వచ్చి ఏడాది అయింది. అయినా ఎలాంటి ఆధారాలు లేకపోయినా లిక్కర్ స్కాం పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ మీద, నాయకుల మీద మీరు ఎన్ని కుట్రలు చేసినా వాటన్నింటినీ చేధిస్తాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల పక్షాన మా పోరాటం ఆగదు. ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందే విషయంపైనా, రాష్ట్రంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపైనా భవిష్యత్తులోనూ మా పోరాటం తగ్గదని కేకే రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

Back to Top